Ponguleti Srinivas Reddy : ఏపీలో పొంగులేటికి భారీ కాంట్రాక్ట్

రూ. 1600 కోట్ల రూపాయ‌ల ఒప్పందం

Ponguleti Srinivas Reddy : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) పార్టీ మారినా ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డితో ఉన్న బంధం మాత్రం మార‌లేదు. ఆయ‌న ఇటీవ‌లే ఖ‌మ్మం వేదిక‌గా జ‌రిగిన జ‌న గ‌ర్జ‌న స‌భ‌లో రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మ‌నోడికి ఏపీలో భారీ కాంట్రాక్ట్ ద‌క్కింది.

Ponguleti Srinivas Reddy Good Relation With CM Jagan

ఆంధ్ర ప్ర‌దేశ్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో భూగ‌ర్భ విద్యుత్ లైన్ కాంట్రాక్టును ఏకంగా రూ. 1600 కోట్ల‌కు ద‌క్కించుకున్నారు. ఈ కాంట్రాక్టు పొందిన కంపెనీ రాఘ‌వ కన్స్ట్రక్షన్. స‌ద‌రు కంపెనీది స్వ‌యంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిది కావ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది 2022 డిసెంబ‌ర్ లో రూ. 1116 కోట్ల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో భూగ‌ర్భ విద్యుత్ లైన్ ఏర్పాటు చేసేందుకు దేశ వ్యాప్తంగా కాంట్రాక్ట‌ర్ల‌ను ఆహ్వానించింది . టెండ‌ర్లు పిలిచినా ఏ ఒక్క కాంట్రాక్ట‌ర్ ప‌నులు చేప‌ట్టేందుకు ముందుకు రాలేదు. ఎవ‌రూ ఆస‌క్తి చూప‌క పోవ‌డంతో తిరిగి గ‌త ఏప్రిల్ లో మ‌రోసారి ఏపీ స‌ర్కార్ టెండ‌ర్లు పిలిచింది. రూ. 1599.93 కోట్ల‌తో టెండ‌ర్ ద‌క్కించుకుంది రాఘ‌వ కంపెనీ. దీంతో మ‌రోసారి జ‌గ‌న్ , పొంగులేటి మ‌ధ్య ఉన్న బంధం ఫెవికోల్ కంటే గ‌ట్టిద‌ని తేలి పోయింది.

Also Read : AP CM YS Jagan : 18,883 జంట‌ల‌కు రూ. 141.60 కోట్లు జ‌మ‌

Leave A Reply

Your Email Id will not be published!