AP Comment : జ‌గ‌న్ ఆవేద‌న మోదీకి అర్థ‌మ‌య్యేనా

రూ. 20,000 కోట్లు వ‌స్తేనే ఆదుకోగ‌లం

AP Comment : సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. ఆయ‌న ఒక్క‌సారి మాట ఇచ్చారంటే ఎన్ని క‌ష్టాలు ఎద‌రైనా, ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా స‌రే వెనుదిరిగి చూడ‌రు.

అంతు చూసే దాకా వ‌దిలి పెట్ట‌రు. విజ‌య‌మో వీర స్వ‌ర్గ‌మో అన్నంత ఇదిగా జ‌గ‌న్ రెడ్డి క‌ష్ట‌ప‌డ‌తారు. చాలా మంది ఆయ‌న‌ను దూరం నుంచి చూసిన వాళ్లు మాత్రం సీఎం అంటే ఇలాగే ఉండాల‌ని అనుకుంటున్నారు.

త‌న తండ్రి నుంచి మొండిత‌నం, త‌న తాత రాజా రెడ్డి నుంచి ధైర్యం తెచ్చుకున్న ఈ యువ‌నేత ఏది చేసినా సంచ‌ల‌న‌మే.

చాలా మంది సీఎంలు వ‌ర‌ద‌ల‌కు సంబంధించి ప్ర‌భావిత ప్రాంతాల‌ను ఏరియ‌ల్ స‌ర్వే చేస్తే జ‌గ‌న్ రెడ్డి మాత్రం ఏరియ‌ల్ స‌ర్వే తో పాటు ముంపు బాధితుల‌తో క‌లిసి ప‌రామ‌ర్శించారు.

ప్ర‌మాద‌క‌ర‌మైన బోటులో ప్ర‌యాణం చేసి వారికి భరోసా క‌ల్పించారు. ఇదిలా ఉండ‌గా ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ ప‌రం చేయొద్ద‌ని విన్న‌వించారు.

ఆ మేర‌కు లేఖ కూడా రాశారు. చివ‌ర‌కు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బేష‌ర‌తు మ‌ద్ద‌తు ఇచ్చారు. కేంద్రం ప‌ట్ల సానుకూల ధోర‌ణితో ఉన్నారు. కానీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ న‌వ్వుతున్నారే త‌ప్పా సైగ చేయ‌డం లేదు. పైసా విద‌ల్చ‌డం లేదు.

భారీ వ‌ర్షాల తాకిడికి ఏపీలోని ప‌లు(AP Comment) ప్రాంతాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. భారీ ఎత్తున సాయం చేయాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంది. ఈ సంద‌ర్భంగా సీఎం చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

కేంద్రంతో కుస్తీ ప‌డుతున్నా స్పందించ‌డం లేద‌ని. ఇక‌నైనా ప్ర‌ధాని జ‌గ‌న్ మొర ఆల‌కించాలి. ఆవేద‌న‌ను అర్థం చేసుకోవాలి.

Also Read : పోటెత్తిన మూసీతో ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!