AP Comment : వరదల్లో సైతం సీఎం సాయం
రాజకీయాలు పక్కన పెడితే భేష్
AP Comment : ఓ వైపు వరదలు ఇంకో వైపు ఇబ్బందులు. మరొకరైతే క్యాంపు ఆఫీసులో లేదా ప్రగతి భవన్ లోనో కూర్చుని రివ్యూ చేస్తారు. కానీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP Comment) మాత్రం ఈ విషయంలో మెచ్చుకుని తీరాల్సిందే.
రాజకీయాలను పక్కన పెడితే వాతావరణ శాఖ హెచ్చరించిన వెంటనే సీఎస్ ను అప్రమత్తం చేశారు. ఆయా ముంపు ప్రభావిత ప్రాంతాలను అలర్ట్ చేశారు.
ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఆపై ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు సమన్వయం చేసుకుని సహాయక చర్యలలో నిమగ్నం అయ్యేలా చేశారు సీఎం.
అంతే కాకుండా ఇప్పటి వరకు ఏరియల్ సర్వే చేశారు. బాధితులకు భరోసా కల్పించారు. ఆపై తానే రంగంలోకి దిగాడు. ఓ వైపు వర్షం కురుస్తున్నా తాను కూడా మీకు అండగా ఉంటానని ధైర్యం ఇచ్చారు.
ప్రమాదకరమైన బోటులో తాను కూడా ప్రయాణం చేశారు. కేవలం మాటల వరకే పరిమితం కాకుండా ఆచరణలో తాను అందరికంటే ముందుంటానని చేతల్లో చూపించారు.
ముంపు, వరద బాధితులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఎక్కడ చూసినా నీళ్లే. ఆయన కళ్లారా చూశారు.
వారికి అభయం ఇచ్చారు. తాను పదే పదే రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని నష్ట నివారణ చర్యలు చేపట్టాలే చూశానని చెప్పారు.
ఏది ఏమైనా ఇప్పుడు సీఎం తీసుకున్న చొరవకు జనం జేజేలు పలుకుతున్నారు. వరదల పేరుతో రాజకీయం చేయడం కాదు కావాల్సింది సాయం అని స్పష్టం చేశారు.
Also Read : వరద బాధితులకు జగన్ రెడ్డి భరోసా