AP Comment : క్యాసినో వ్యవహారం ఏపీలో కలకలం
జూదం ఆడక పోతే బతకలేమా
AP Comment : సకల అవలక్షణాలు ఉన్న వాళ్లు ఇప్పుడు ఊరేగుతున్నారు. దర్జాగా దౌర్జన్యం చేస్తున్నారు. ఆపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. అంతేనా రక్షించాల్సిన వాళ్లు, భరోసా ఇవ్వాల్సిన వాళ్లు, న్యాయం చెప్పే వాళ్లు సైతం క్యాసినో వ్యసనానికి బానిసలై పోయారు.
పోనీ వీళ్లను వదిలి వేద్దామా అంటే తగదునమ్మా అంటూ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు సైతం(AP Comment) ఇందులో దూరి పోయారు. ఆపై బహిరంగంగా తాము ఆడుతూనే ఉంటామని ప్రకటిస్తున్నారు.
సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపాల్సిన వాళ్లు, లక్షలాది మందికి ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన వాళ్లు ఇవాళ నిస్సిగ్గుగా తాము సైతం క్యాసినో లేకుండా ఉండలేమని అంటున్నారు.
రాజకీయం, నేరం, అధికారం, మాఫియా కలిస్తే ఇంకేముంటుంది చెప్పు కోవడానికి కోల్పోవడం తప్ప. వీళ్లు బయటకు వచ్చి ఏం సమాధానం చెబుతారు జనాలకు. ఒక్కసారి ఆలోచించు కోవాలి.
ఇక క్యాసినో నిర్వాహకుడిగా పేరొందిన చీకోటి ప్రవీణ్ (AP Comment) పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. ఆయన గారి జాబితాలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధుల జాబితా చాంతాడంత ఉంది.
కొందరి పేర్లు బయటకు వచ్చాయి. వీళ్లే కాదు ఐపీఎస్ లు, ఐఏఎస్ లు, డాక్టర్లు, నటీ నటులు ఇలా చెప్పుకుంటూ పోతే నేటి సమాజంలో ప్రముఖులుగా పేరొందిన వారిలో చాలా మంది లిస్టులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా ఎవరు ఉన్నారనే దాని కంటే ఎలా కట్టడి చేయాలో ఏపీ సర్కార్ ఆలోచిస్తే మంచిది లేక పోతే ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది. విచిత్రం ఏమిటంటే చీకోటి వారి వాహనాన్ని చిన్నజీయర్ స్వామి ప్రారంభించడం మరో ట్విస్ట్ .
ఇక తారల తళుకు బెళుకుల సంగతి చెప్పాల్సిన పని లేదు.
Also Read : గోటబయ భవనంలో రూ. 17.85 మిలియన్లు