AP Comment : జగన్ దూకుడుకు బీజేపీ కల్లెం వేసేనా
అసలు ఏపీలో బీజేపీ ఏం చేస్తున్నట్టు
AP Comment : దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ..ఒకే దేశం..ఒకే మతం..ఒకే భాష ఉండాలన్నది భారతీయ జనతా పార్టీ కల. ఇందు కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్దమని ప్రకటించింది.
అంతేనా మోదీ త్రయం (మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ) మదిలో ఒక్కటే ఉంది. మరోసారి గనుక పవర్ లోకి వస్తే ఇక వాళ్లు అనుకున్నది చేసేందుకు రెడీగా ఉంటారన్నది వాస్తవం.
గతంలో బీజేపీకి దక్షిణాదిన అంత పట్టుండేది కాదు. కానీ మోదీ కొలువు తీరాక సీన్ మారింది. ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగాక వ్యూహాలు మారుతున్నాయి.
చకా చకా ప్రభుత్వాలు కూలి పోతున్నాయి. దివంగత ప్రధాన మంత్రి వాజ్ పేయ్ ఉన్నప్పుడు బీజేపీ వేరు ప్రస్తుతం టార్చ్ బేరర్ గా పేరొందిన మోదీని తట్టుకోవడం కష్టమే. ప్రధాన టార్గెట్ సౌత్ లో పాగా వేయాలని. ఆ దిశగా పావులు కదుపుతూ వచ్చారు.
ఇప్పటి వరకు 9 రాష్ట్రాలలో ప్రభుత్వాలను మార్చేశారు. ఇక మిగిలింది తమిళనాడు. కర్ణాటకలో పవర్ లోనే ఉన్నారు. తెలంగాణలో గులాబీ దళంతో రెఢీ అంటున్నారు.
అయితే ఏపీలో మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తున్నా జగన్ మొదట్లో ధిక్కార స్వరం వినిపించినా ఇప్పుడు మోదీ టీంలోకి చేరి పోయాడు.
అంటే బీజేపీ జస్ట్ వెయిట్ అండ్ సీ అనే ధోరణితో ముందుకు వెళుతోంది ఏపీలో. మరో వైపు జగన్ రెడ్డి మాత్రం పకడ్బందీగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వెళుతున్నారు.
ఇక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. రాబోయే ఎన్నికల్లో కాషాయం స్ట్రాటజీ ఎలా ఉండబోతోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న(AP Comment).
Also Read : గ్యాస్ లీకేజీపై ఏపీ సర్కార్ సీరియస్