AP Comment : సంక్షేమం ప్రమాదం కానుందా
అప్పులతోనే అభివృద్ది అంటే ఎలా
AP Comment : ఏ రాష్ట్రమైనా అభివృద్ది చెందాలంటే మౌలిక వసతులను సమకూర్చు కోవాలి. కానీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అమలుకు నోచుకోని హామీలు ఇవ్వడం లేదంటే మరింత భారం పెరిగేలా వాటిని అమలు చేసేందుకు అప్పులు తీసుకు రావడం అన్నది గత కొంత కాలం నుంచీ అలవాటుగా వస్తోంది.
ఇది దేశానికి, ఏపీకి(AP Comment), తెలంగాణకు వర్తిస్తుంది. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయి. కానీ ప్రతి నెలా అప్పుల భారం, సంక్షేమ పథకాల బరువు మరింత పెరుగుతోంది. దీనిని తట్టుకుని నిలబడాలంటే మరింతగా అప్పులు చేయడం మినహా మరో మార్గం కనిపించడం లేదు.
ఇది అత్యంత ప్రమాదకరమైనది. ప్రజల్ని ఓటు బ్యాంకుగా చూస్తే మిగిలేది తిప్పలే. పథకాలు అమలు అయ్యేంత వరకు జనం ఏమీ అనరు. ఎప్పుడైతే ఆగి పోతాయో ఆనాటి నుంచీ వ్యతిరేకత ఎదురవుతూ వస్తుంది.
ఓ వైపు కేంద్రం ఇంకో వైపు రాష్ట్రం మధ్య సత్ సంబంధాలు ఉంటేనే ఇంకా నిధులు రాకుండా పోతున్నాయి. రోజు రోజుకు ఏపీలో అప్పుల భారం తడిసి మెపడవుతోంది.
ఇది రాను రాను రెడ్ బెల్స్ మోగించేలా ఉంది. ప్రజలను ఆదాయ వనరులుగా చూసినంత కాలం ఇలాగే ఉంటుంది. ప్రధానంగా వారిని కార్యోన్ముఖులుగా మార్చాలి. పనుల్లో భాగస్వామ్యం చేయాలి.
ఇందుకు విరివిగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే కొంత మేరకు ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు.
ఏది ఏమైనా సంక్షేమం అవసరమే కానీ మితి మీరిన తాయిలాలు గొంతుకు ఉరితాళ్లుకాక మానవని గుర్తుంచు కోవాలి.
Also Read : కొలువుల భర్తీ ఎన్నికల స్టంటేనా