ఏపీలో పవర్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్న మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ తగిలింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం దెబ్బ కొట్టింది. కర కట్టపై చంద్రబాబు నాయుడు నిర్మించిన గెస్ట్ హౌస్ ను అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేసినట్లు వైసీపీ సర్కార్ స్పష్టం చేసింది. ఆదివారం ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, మంత్రిగా ఉన్న నారాయణ ఇద్దరూ కలిసి తమ పదవులను దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ఈ ఇద్దరూ క్విడ్ ప్రో కు పాల్పడ్డారని పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కర కట్ట గెస్ట్ హౌస్ ను అటాచ్ చేసినట్లు తెలిపింది వైసీపీ ప్రభుత్వం.
అంతే కాకుండా సీఆర్డే మాస్టర ప్లాన్ , ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లలో తీవ్ర అవకతవకలు జరిగాయని, దానికి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని అభియోగం మోపింది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి సాధారణ ఆర్థిక నియమాలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయిందని పేర్కొంది.
