AP Govt : వరద బాధితుల కోసం భారీగా ఆహార పదార్థాలు సిద్ధం చేసిన సర్కార్

ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ....

AP Govt : విజయవాడ నగరాన్ని వరద ముంపు ముంచెత్తిన విషయం తెలిసిందే. విజయవాడ నగర వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. పూర్తిగా ఆయన నిద్రాహారాలు మాని మరీ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ జనాలకు ధైర్యం చెబుతున్నారు. నగరంలో వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు భారీగా ఆహారం పొట్లాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇతర జిల్లాల నుంచి ఇందిరా గాంధీ స్టేడియానికి లారీల్లో ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్స్, వాటర్ ప్యాకెట్స్ చేరుకున్నాయి. నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్ల పంపిణీని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Narayana) పరిశీలించారు.

AP Govt Prepare

ఈ సందర్భంగా నారాయణ(Minister Narayana) మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఒక విడత ఆహారాన్ని ఉదయం టిఫిన్ కోసం పంపించామన్నారు. 3 లక్షల వాటర్ బాటిల్స్ కూడా బాధితులకు పంపిణీ చేశామని వెల్లడించారు. గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, రాజహేంద్రవరం మున్సిపాలిటీలతో పాటు హరే కృష్ణ మూవ్‌మెంట్, పలు కంపెనీలకు ఆహారం తయారీ బాధ్యతలు అప్పగించామన్నారు. మొత్తం 6 లక్షల ఫుడ్ ప్యాకెట్లు,6 లక్షల వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఆహారంతో పాటు అరటిపండ్లు, ఇతర ఫ్రూట్స్ కూడా బాధితులకు పంపించినట్టుగా వెల్లడించారు.

వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా విజయవాడలోనే ఉండి అన్ని ఏర్పాట్లూ చూస్తోంది. విజయవాడ ముంపు బాధితుల కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వార్డుల వారీగా మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. విపత్తుల సంస్థలోని కంట్రోలో రూమ్ నుంచి 24 గంటలు 8 మంది ఐఏఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో శరవేగంగా ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. 6 హెలికాప్టర్లు, డ్రోన్స్ ద్వారా ఆహారం, నీరు, పాలు, పండ్లు, బిస్కెట్స్, మెడిసిన్ పంపిణీ చేశారు. ప్రాథమిక అవసరాలు అందించడానికి అగ్ర ప్రాధాన్యతనిస్తున్నారు. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. 43,417 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 197 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో 48 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామ సేవలు అందిస్తున్నాయి.

Also Read : MP Eatala Rajender : వరదల్లో మరణించిన వారికి సర్కార్ 50 లక్షల పరిహారం అందించాలి

Leave A Reply

Your Email Id will not be published!