AP High Court : టీఎంసీకి టీటీడీ నిధులు వ‌ద్దు

ఆదేశించిన ఏపీ హైకోర్టు ధ‌ర్మాస‌నం

AP High Court : అమ‌రావ‌తి – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)కి బిగ్ షాక్ త‌గిలింది. తిరుమ‌ల పుర‌పాలిక సంఘం ప‌రిధిలోని శానిటైజేష‌న్, ప‌రిశుభ్ర‌త కోసం టీటీడీ నుంచి నిధులు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు టీటీడీ పాలక మండ‌లి మాజీ స‌భ్యుడు భాను ప్ర‌కాష్ రెడ్డి. ఈ మేర‌కు ఆయ‌న హైకోర్టులో(AP High Court ) ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం కింద పిల్ దాఖ‌లు చేశారు.

AP High Court Orders

బుధ‌వారం ఈ పిల్ పై కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. సుదీర్ఘ వాదోప వాద‌న‌లు కొన‌సాగాయి. టీటీడీ కేవ‌లం భ‌క్తుల ప్ర‌యోజ‌నాల కోసం, వారికి సౌక‌ర్యాల కోసం మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని , ఈ నిధుల‌ను ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌కు వాడ కూడ‌దని కోరారు పిటిష‌న్ లో పిటిష‌న్ దారుడు.

అయితే టీటీడీ త‌ర‌పున లాయ‌ర్ కూడా వాద‌న‌లు వినిపించారు. తిరుప‌తి ప‌ట్ట‌ణం కూడా టీటీడీ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని, దీని అభివృద్ది కూడా ముఖ్య‌మ‌ని వాదించారు. వీటిని త‌ప్పు ప‌ట్టారు పిల్ త‌ర‌పు లాయ‌ర్.

కేంద్ర‌, రాష్ట్ర నిధులు కార్పొరేష‌న్ కు వ‌స్తాయ‌ని, ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌మైన ధార్మిక క్షేత్రంగా వినుతికెక్కింది తిరుమ‌ల అని. ఎక్క‌డి నుంచో ల‌క్ష‌లాది మంది భ‌క్తులు వ‌స్తార‌ని, కేవ‌లం స్వామి వారికి , తిరుమ‌ల అభివృద్దికి మాత్ర‌మే వినియోగించాల‌ని కోరుకుంటార‌ని తెలిపారు. భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ తినేలా టీటీడీ నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు పిటిష‌న్ దారుడు భాను ప్ర‌కాష్ రెడ్డి.

ఈ కేసుకు సంబంధించి వాదోప వాద‌న‌లు విన్న అనంత‌రం ధ‌ర్మాస‌నం సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ఎట్టి ప‌రిస్థితుల్లో టీటీడీ నిధుల‌ను ఇత‌ర ప‌నుల‌కు వినియోగించ‌కుండా స్టే విధించింది.

Also Read : Malla Reddy : మ‌ల్లారెడ్డిపై కేసు న‌మోదు

Leave A Reply

Your Email Id will not be published!