AP Home Minister : ఏపీలో డ్రగ్స్, గంజాయి పై ఉక్కుపాదం మోపుతాం

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ....

AP Home Minister : ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. కానిస్టేబుల్‌పై మద్యం మత్తులో యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే విశాఖలోని సెవెన్ హిల్స్ హస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పారావును ఈరోజు(ఆదివారం) హోమంత్రి అనిత పరామర్శించారు.

AP Home Minister Comment

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… ఈ కేసులో నిందితుడికి చట్ట ప్రకారమే కఠినంగా శిక్ష ఉంటుందని తెలిపారు. పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పని చేయాలని సూచించారు. కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.

Also Read : P Chidambaram : ఆ నాడు ఎమర్జెన్సీ పొరపాటని ఇందిరా గాంధీనే ఒప్పుకున్నారు

Leave A Reply

Your Email Id will not be published!