AP New Cabinet : గత కొంత కాలంగా ఉత్కంఠకు తెర లేపిన ఏపీ కొత్త కేబినెట్ ఫైనల్ అయ్యింది. ఈ మేరకు పాత ,కొత్త మేలు కలయికతో దీనిని రూపొందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కొత్తగా కొలువు తీరే మంత్రివర్గంలో మొత్తం 25 (AP New Cabinet)మంది ఉండనున్నారు.
ఇక కేబినెట్ కూర్పు పరంగా అన్ని సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశారు సీఎం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రయారిటీ ఇచ్చారు. జాబితా ప్రకారం చూస్తే గుడివాడ అమర్ నాత్, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, రాజన్న దొర ఉన్నారు.
వీరితో పాటు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ , అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనితకు ఛాన్స్ ఇచ్చారు.
కారుమూరి నాగేశ్వర్ రావు, మేరుగ నాగార్జున, బూడి ముత్యాలనాయుడు, విడుదల రజని, కాకాణి గోవర్దన్ రెడ్డి, అంజాద్ భాష, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి అవకాశం(AP New Cabinet) దక్కింది.
బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, విశ్వరూప్ , గుమ్మనూరు జయరాం, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, తిప్పేస్వామి, వేణుగోపాల్ , నారాయణ స్వామి ఉన్నారు.
చీఫ్ విప్ గా ప్రసాదరాజు, డిప్యూటీ స్పీకర్ గా వీరభద్ర స్వామి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణును ఖరారు చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఇదిలా ఉండగా పాత వారిలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, అప్పలరాజు, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణకు మరోసారి అవకాశం ఇచ్చారు ఏపీ సీఎం జగన్ రెడ్డి.
Also Read : మంత్రుల కోసం ఏర్పాట్లు ముమ్మరం