AP Speaker Warning : బాలయ్యను హెచ్చరించిన స్పీకర్
అసెంబ్లీలో మీసం తిప్పడంపై సీరియస్
AP Speaker Warning : ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గురువారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏపీ స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
AP Speaker Warning to Balakrishna
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఓవర్ యాక్షన్ చేశారు. సభ అన్న ఆలోచన లేకుండా మీసం తిప్పారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. నీకు అంత సీన్ లేదన్నారు. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే దా చూసుకుందామంటూ ప్రకటించారు.
దీంతో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
మరో వైపు సభ సాక్షిగా మీసం తిప్పిన నందమూరి బాలకృష్ణపై సీరియస్ అయ్యారు. తీవ్రంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకో సారి ఇలాగే వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు స్పీకర్ సీతారం.
Also Read : AP Speaker Suspend : టీడీపీ సభ్యులపై స్పీకర్ వేటు
