AP Speaker Suspend : టీడీపీ స‌భ్యుల‌పై స్పీక‌ర్ వేటు

15 మందిపై స‌స్పెన్ష‌న్

AP Speaker Suspend : గుంటూరు – ఏపీ అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్ ను నిర‌సిస్తూ తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. మ‌రికొంద‌రు స‌భ్యులు పోడియం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆందోళ‌న చేప‌ట్టారు.

AP Speaker Suspend Viral

ప్ల కార్డుల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా మంత్రి అంబ‌టి రాంబాబు హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య మాట‌ల యుద్దం కొసాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నారు.

ఇదే స‌మ‌యంలో నంద‌మూరి బాల‌కృష్ణ మీసం మెలేశారు. నీకు అంత సీన్ లేద‌ని, ఇది సినిమా షూటింగ్ కాదంటూ మండిప‌డ్డారు అంబ‌టి రాంబాబు. ఒక‌రి నొక‌రు స‌వాళ్లు విసురుకున్నారు. దీంతో ఎంత‌కూ స‌భ న‌డిచే ప‌రిస్థితి లేక పోవ‌డంతో స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం(Tammineni Seetharam) సీరియ‌స్ అయ్యారు.

స‌భా మ‌ర్యాద‌లు పాటించ‌కుండా అడ్డుకున్నందుకు గాను టీడీపీ స‌భ్యుల‌పై వేటు వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనుచితంగా ప్ర‌వ‌ర్తించినందుకు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్ ల‌పై స‌స్పెన్ష‌న్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ఇద్ద‌రినీ సెష‌న్ పూర్త‌య్యేంత వ‌ర‌కు ఇది వ‌ర్తిస్తుంద‌న్నారు.

మిగ‌తా టీడీపీ స‌భ్యుల‌ను ఇవాల్టి వ‌ర‌కు స‌స్పెండ్ విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీతారాం.

Also Read : TDP Tribute NTR : ఎన్టీఆర్ కు టీడీపీ నివాళి

Leave A Reply

Your Email Id will not be published!