Raghav Chadha : అర్ష దీప్ పేరెంట్స్ కు ఆప్ భరోసా
ట్రోలింగ్ పై పట్టంచు కోవద్దని సూచన
Raghav Chadha : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ -2022లో(Asiacup 2022) పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అత్యంత సులభమైన క్యాచ్ జార విడిచాడు పంజాబ్ మొహాలీకి చెందిన అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh).
దీంతో సింగ్ కారణంగానే భారత జట్టు ఓటమి పాలైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దారుణంగా ట్రోలింగ్ కు గురయ్యాడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అర్ష్ దీప్ కు మద్దతుగా నిలిచాడు.
ఆటగాళ్లకు మ్యాచ్ ఆడే సమయంలో టెన్షన్ ఉంటుందని, ఇది సహజమైన విషయమన్నాడు. మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి దిగిన ప్రతి ఆటగాడు దేశం కోసం ఆడుతున్నాననే భావిస్తారని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నాడు.
ఇదే వేదికపై టి20 వరల్డ్ కప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ తో మహ్మద్ షఫీ దారుణంగా బౌలింగ్ చేయడాన్ని తప్పు పట్టారు. అతడు పాకిస్తాన్ కు అమ్ముడు పోయాడంటూ ట్రోల్ జరిగింది.
తాజాగా అర్ష్ దీప్ సింగ్ పై సామాజిక మాధ్యమాలలో ఇప్పటికీ మండిపడుతున్నారు. కాగా మాజీ ఆటగాళ్లతో పాటు పంజాబ్ లో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది.
మంగళవారం ఆప్ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు రాఘవ్ చద్దా(Raghav Chadha) అర్ష్ దీప్ సింగ్ నివాసానికి వెళ్లారు. అర్ష్ దీప్ సింగ్ పేరెంట్స్ ను కలిశారు. వారిని పరామర్శించారు.
ట్రోల్ కు గురి కావడం సహజమేనని ఇవన్నీ ఆటలో భాగమేనని పేర్కొన్నారు చద్దా. ఆట అన్నాక గెలుపు ఓటములు ఉంటాయని ఒకరిని మాత్రమే నిందిస్తే ఎలా అని ప్రశ్నించాడు.
Also Read : అర్ష్ దీప్ పై ట్వీట్..జుబైర్ పై ఫిర్యాదు
I just met bowling superstar Arshdeep's family in Kharar, Punjab. His parents have persevered & sacrificed so much. His struggle & perseverance, from humble origins to playing for India at international stage is inspiring. We all stand firmly with Arsh today. #IStandWithArshdeep pic.twitter.com/mcT1DlPsRl
— Raghav Chadha (@raghav_chadha) September 5, 2022