Tim Cook Sonam Kapoor : ఐపీఎల్ లో టిమ్ కుక్ సందడి
ఢిల్లీ క్యాపిటల్స్ , కేకేఆర్ మ్యాచ్
Tim Cook Sonam Kapoor : ప్రముఖ దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ సిఇఓ టిమ్ కుక్(Tim Cook) వైరల్ గా మారారు. ఆయన ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్నారు. యాపిల్ సంస్థ తొలిసారిగా భారత్ లో రెండు యాపిల్ స్టోర్ లను ఏర్పాటు చేసింది. మంగళవారం ముంబై లోని బాంద్రాలో ఏర్పాటు చేసిన యాపిల్ స్టోర్ ను టిమ్ కుక్ ప్రారంభించారు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో గురువారం యాపిల్ స్టోర్ ను ప్రారంభించారు.
అంతకు ముందు యాపిల్ సిఇఓ టిమ్ కుక్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు. అంతే కాదు ఆయనకు భవిష్యత్తు పట్ల మంచి విజన్ ఉందని కొనియాడారు. దీనిపై మోదీ థ్యాంక్స్ తెలిపారు.
తాజాగా టిమ్ కుక్ హల్ చల్ చేశారు. ఎక్కడో కాదు ఢిల్లీలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా మారారు. ఢిల్లీలో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ ను టిమ్ కుక్ వీక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక యాపిల్ సిఇఓ పక్కన సోనమ్ కపూర్(Sonam Kapoor) కలిసి వీక్షించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్