Apple I Phone 14 : భార‌త్ లో ఐ ఫోన్ 14 త‌యారీకి రెడీ

అమెరికా ఫోన్ల త‌యారీ కంపెనీ ప్ర‌క‌ట‌న

Apple I Phone 14 : ప్ర‌పంచంలోనే టాప్ పొజిష‌న్ లో కొన‌సాగుతున్న అమెరికాకు చెందిన ఆపిల్ కంపెనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు త‌మ కంపెనీకి సంబంధించి ఫోన్ల త‌యారీ యూనిట్ ను భార‌త్ లో నెల‌కొల్పేందుకు ప్లాన్ చేసింది.

ఇందులో భాగంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎక్కువ డిమాండ్ క‌లిగిన త‌మ కంపెనీకి చెందిన ఐ ఫోన్ 14(Apple I Phone 14) ను త‌యారు చేసేందుకు రెడీగా ఉన్న‌ట్లు తెలిపింది. కొత్త‌గా అడ్వెంచ‌ర్ ఫోక‌స్డ్ వాచ్ ను మిన‌హాయించి మెరుస్తున్న కొత్త సాంకేతిక ల‌క్ష‌ణాల కంటే భ‌ద్ర‌తా న‌వీక‌ర‌ణ‌ల‌పై ఫోక‌స్ పెట్టింది యాపిల్ కంపెనీ.

టెక్ దిగ్గ‌జం త‌న ఉత్ప‌త్తిలో కొంత భాగాన్ని చైనా నుండి త‌ర‌లించింది. ఆపిల్ ఇంక్ త‌న తాజా ఐఫోన్ 14ను భార‌త దేశంలో త‌యారు చేయ‌నున్న‌ట్లు సోమ‌వారం ప్ర‌క‌టించింది స‌ద‌రు కంపెనీ. ఇదిలా ఉండ‌గా కంపెన ఈనెల ప్రారంభంలో జ‌రిగిన ఒక ఈవెంట్ ఫ్లాగ్ షిప్ ఐ ఫోన్ 14ను ప్రారంభించింది.

కొత్త ఐఫోన్ 14 లైన‌ప్ కొత్త(Apple I Phone 14) సాంకేతిక‌త‌లు, ముఖ్య‌మైన భ‌ద్ర‌తా సామ‌ర్థ్యాల‌ను ప‌రిచ‌యం చేసింది. తాము భార‌త దేశంలో ఐఫోన్ 14ని త‌యారు చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని చెప్పేందుకు సంతోషిస్తున్న‌ట్లు తెలిపింది ఆపిల్ కంపెనీ.

అయితే జేపీ మోర్గాన్ లోని విశ్లేష‌కులు మాత్రం ఐఫోన్ 14 ఉత్ప‌త్తిలో 5 శాతం 2022 చివ‌రి నుండి భార‌త దేశానికి త‌ర‌లిస్తుంద‌ని భావిస్తున్నారు. కాగా ప్ర‌పంచంలోనే ఫోన్ మార్కెట్ లో చైనా త‌ర్వాత ప్ర‌పంచంలో రెండో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉంది భార‌త్.

Also Read : క‌నిష్ట స్థాయికి ప‌డి పోయిన రూపాయి

Leave A Reply

Your Email Id will not be published!