P Chidambaram : దేశానికి ఆర్థిక జ్యోతిష్యుడు అవ‌స‌రం

కేంద్రానికి సూచించిన పి.చిదంబ‌రం

P Chidambaram : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు పి.చిదంబ‌రం(P Chidambaram) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దేశంలో రోజు రోజుకు ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారుతోంద‌ని కానీ ప్ర‌ధాని మాత్రం ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో ఆర్థిక శాఖ‌ను నిర్వ‌హిస్తున్న నిర్మ‌లా సీతారామ‌న్ త‌న శాఖ కంటే ఇత‌ర శాఖ‌ల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌ర‌ణ దిశ‌గా న‌డిపించ‌డం కంటే యురేన‌స్, ప్లూటోల‌పై ఆర్థిక మంత్రి ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

మంత్రికి మ‌రింత సౌల‌భ్యంగా ఉండేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం లేదా మోదీ వెంట‌నే ఆస్థాన ఆర్థిక జ్యోతిష్యుడిని నియ‌మిస్తే బావుంటుంద‌ని సూచించారు పి. చిదంబ‌రం(P Chidambaram).

నిర్మ‌లా సీతారామ‌న్ త‌న సొంత నైపుణ‌యాల‌పై , త‌న ఆర్థిక స‌ల‌హాదారుల‌ను ప‌ట్టించు కోకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను రక్షించేందుకు గ్ర‌హాల‌ను పిలిచారంటూ మండిప‌డ్డారు.

నాసా త‌న కొత్త శ‌క్తివంత‌మైన అంత‌రిక్ష టెలిస్కోప్ నుండి ఆవిష్క‌రించిన చిత్రాల‌ను రీట్వీట్ చేశాక చిదంబ‌రం ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ద్ర‌వ్యోల్బ‌ణం దేశంలో 7.01 శాతం, నిరుద్యోగం 7.8 శాతం గా ఉంది.

ఇలాంటి విప‌త్క‌ర త‌రుణంలో ఆర్థిక మంత్రి ప్లూటో, యురోన‌స్ చిత్రాల‌ను ట్వీట్ చేయ‌డం త‌న‌తో పాటు దేశ ప్ర‌జ‌ల‌ను విస్మ‌యానికి గురి చేసింద‌ని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి.

ఇప్ప‌టికే దేశంలో ఉన్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త మోదీకే(PM Modi) ద‌క్కుతుంద‌న్నారు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను కూడా వ‌ద‌లడం లేద‌న్నారు.

Also Read : ప్ర‌భుత్వ బ్యాంకులపై క‌న్నేసిన కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!