Supreme Court : 153 మంది హైకోర్టు జ‌డ్జీల నియామ‌కం

మ‌రిన్ని నియామ‌కాలు జ‌రిగే అవ‌కాశం

Supreme Court : భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భాగంగా దేశంలోని హైకోర్టుల‌లో జ‌డ్జీల నియామ‌కానికి సంబంధించి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది 2022లో 153 మంది హైకోర్టు న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించింది.

మ‌రిన్ని నియామ‌కాలు జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది. బాంబే హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీపాంక‌ర్ ద‌త్తాకు ప‌దోన్న‌తి ల‌భించింది. ఇందులో భాగంగా ఆయ‌న‌ను సుప్రీంకోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మించింది. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుప‌నుంది.

ఇదిలా ఉండ‌గా న‌వంబ‌ర్ 8న సీజేఐగా ఉన్న జ‌స్టిస్ యుయు ల‌లిత్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆయ‌న స్థానంలో జ‌స్టిస్ డీవై చంద్ర చూడ్ త‌దుప‌రి సీజేఐగా ఎంపిక కానున్నారు. తాజాగా బాంబే హైకోర్టుకు ఆరుగురు అద‌న‌పు న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించింది సుప్రీంకోర్టు(Supreme Court) .

ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో ఇప్ప‌టి దాకా వివిధ హైకోర్టులలో పెద్ద ఎత్తున న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించిన‌ట్లు తెలిపింది. రానున్న రోజుల్లో అత్యున్న‌త న్యాయ వ్య‌వ‌స్థ‌కు మ‌రిన్ని నియామ‌కాలు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రో వైపు కొత్త సీజేఐ ఎవ‌ర‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఇక దీపాంక‌ర్ ద‌త్తా గ‌నుక సుప్రీంకోర్టుకు బ‌దిలీ అయితే ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల సంఖ్య 34కి చేరింది. ఇందులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సీజేఐ ఒక‌రు ఉన్నారు. ఈ వారంలో లేదా వ‌చ్చే వారంలో త‌దుప‌రి సీజేఐ నియామ‌కం జ‌ర‌గ‌నుంది. ద‌త్తాను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార‌సు చేసింది. ఆ మేర‌కు జ‌స్టిస్ యుయు ల‌లిత్ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

Also Read : సీజేఐ నియామ‌కంపై సస్పెన్స్

Leave A Reply

Your Email Id will not be published!