Mukesh Ambani Office : సింగ‌పూర్ లో అంబానీ ఫ్యామిలీ ఆఫీస్

మేనేజ‌ర్ నియామ‌కం కూడా రెడీ

Mukesh Ambani Office : భార‌తీయ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రిల‌య‌న్స్ గ్రూప్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఫ్యామిలీ సింగ‌పూర్ లో త‌మ కుటుంబానికి సంబంధించి కొత్త‌గా ఆఫీసును ఓపెన్ చేసింది. ఇప్ప‌టికే ఇందులో ప‌ని చేసేందుకు గాను మేనేజ‌ర్ ను కూడా నియ‌మించింది. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించలేదు ఇందుకు సంబంధించి. ఇంకా వివ‌రాలు గోప్యంగా ఉంచారు.

సింగ‌పూర్ లో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌లు కొలువుతీరి ఉన్నారు. ప్ర‌స్తుతం అత్యంత సంప‌న్నుల శ్రేణుల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతున్నారు ముకేష్ అంబానీ. ఇక ఆసియాలో రెండ‌వ అత్యంత సంప‌న్న వ్య‌క్తిగా పేరొందారు అంబానీ. సింగ‌పూర్ లో కేవ‌లం త‌మ ఫ్యామిలీ కోస‌మే ఓ ఆఫీసును ఏర్పాటు చేశారు.

ఒక ర‌కంగా దానిని భారీ ఎత్తున ధ‌ర చెల్లించి కొనుగోలు చేసిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. ముంబైకి చెందిన ఈ బిలియ‌నీర్ ఏది చేసినా అది సంచ‌ల‌న‌మే. కొత్త సంస్థ కోసం సిబ్బందిని నియ‌మించు కోవ‌డానికి , దానిని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేసేందుకు కొత్త‌గా మేనేజ‌ర్ ను కూడా నియ‌మించిన‌ట్లు టాక్. ఈ పోస్ట్ కు భారీ డిమాండ్ ఉండ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణం.

అందుకే అంత ఆస‌క్తి పెరిగింది ముకేష్ అంబానీ ఆఫీసుపై. ఇప్ప‌టికే సింగ‌పూర్ జాబితాలో హెడ్జ్ ఫండ్ బిలియ‌నీర్ రే డాలియో , గూగుల్ కో ఫౌండ‌ర్ సెర్గీ బ్రీన్ వంటి వారితో ముకేష్ అంబానీ చేరారు. ఇక మానిట‌రీ ఆఫ్ సింగ‌పూర్ అంచ‌నా ప్ర‌కారం 2021 చివ‌రి నాటికి 700 మంది సంప‌న్నులు ఇక్క‌డ కొలువు తీరారు.

Also Read : మ‌స్క్ ట్విట్ట‌ర్ డీల్ పున‌రుద్ద‌ర‌ణ

Leave A Reply

Your Email Id will not be published!