Argentina Record : అర్జెంటీనా అరుదైన ఘ‌న‌త

ఆరుసార్లు ఫైన‌ల్ చేరిన టీం

Argentina Record : ఖ‌తార్ వేదిక‌గా జరుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 ఆఖ‌రి అంకానికి చేరింది. కేవ‌లం ఒకే అడుగు దూరంలో మిగిలింది. మొత్తం 32 జ‌ట్లు పాల్గొన్న ఈ మెగా ఖ‌రీదైన టోర్నీలో చివ‌ర‌కు సెమీస్ కు అర్జెంటీనా, క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో జ‌ట్లు చేరుకున్నాయి. మొద‌టి సెమీ ఫైన‌ల్ లో అర్జెంటీనా – క్రొయేషియా త‌ల‌ప‌డ్డాయి.

మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా క్రొయేషియాను 3-0 తేడాతో ఓడించి నేరుగా ఫైన‌ల్ కు చేరింది. ఇక మిగిలింది ఫ్రాన్స్ – మొరాకో మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఆ జ‌ట్టుతో మెస్సీ టీం ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం త‌ల‌ప‌డ‌నుంది. ఇదిలా ఉండ‌గా అర్జెంటీనా(Argentina Record) అంటేనే డిగో మార‌డోనా.

క‌ళ్లు చెదిరే బంతుల్ని గోల్స్ గా మార్చ‌డంలో అత‌డికి అత‌డే సాటి. త‌న సార‌థ్యంలో అర్జెంటీనాకు క‌ప్ అందించాల‌ని క‌సితో ఉన్నాడు మెస్సీ. ఇదిలా ఉండ‌గా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో ఎనిమిదిసార్లు త‌ల‌ప‌డితే అర్జెంటీనా(Argentina Record) ఆరుసార్లు ఫైన‌ల్ కు చేరింది. ఇది ఆ దేశానికి సంబంధించి ఓ రికార్డ్ . 1986లో ఆ జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ ను గెలుపొంది.

అంత‌కు ముందు అర్జెంటీనా 1978లో ఫుట్ బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. మూడుసార్లు ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. 1930, 1990, 2014లో ఈ ఘ‌న‌త సాధించింది. 18 ప్ర‌పంచ క‌ప్ టోర్నీల‌లో అర్జెంటీనా 84 మ్యాచ్ లు ఆడింది. 48 విజ‌యాలు సాధించింది. నాలుగు ప్ర‌పంచ క‌ప్ ల‌లో త‌ప్ప మిగిలిన అన్ని టోర్నమెంట్ ల‌లో అర్జెంటీనా పాలు పంచుకుంది.

Also Read : అల్వారెజ్ బ‌హుమానం మెస్సీ ఆనందం

Leave A Reply

Your Email Id will not be published!