Argentina VS Croatia : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కు అర్జెంటీనా
3-0 తేడాతో క్రొయేషియాపై గ్రాండ్ విక్టరీ
Argentina VS Croatia : మరోసారి అర్జెంటీనా మ్యాజిక్ చేసింది. ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ -2022లో క్రొయేషియాను ఓడించి ఫైనల్ కు చేరింది. మోస్ట్ డేంజరస్ ప్లేయర్ గా పేరొందిన మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా(Argentina VS Croatia) ఆరోసారి ఫైనల్ కు చేరి చరిత్ర సృష్టించింది. ఈసారి ఊహించని రీతిలో టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్న జట్లన్నీ ఇంటి బాట పట్టాయి.
ఇక ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫుట్ బాలర్ గా పేరొందిన క్రిసియానో రెనాల్డో కు చెందిన పోర్చుగల్ ఓటమి పాలైంది. మొరాకో చేతిలో 1-0 తేడాతో పరాజయం పాలు కావడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు రొనాల్డో. 3-0 తేడాతో క్రొయేషియాను మట్టి కరిపించాడు. అల్వా రెజ్ తో కలిసి మెస్సీ మ్యాజిక్ చేశాడు.
అటు అర్జెంటీనా ఇటు క్రొయేషియా జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. జూలియస్ అల్వారెజ్ ఒక గోల్ కొడితే , మెస్సీ కళ్లు చెతిరే గోల్ తో షాక్ ఇచ్చాడు ప్రత్యర్థి జట్టుకు. ఈ గెలుపుతో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా నేరుగా ఫైనల్ కు చేరింది. ఇక మరో కీలక సెమీ ఫైనల్ లో ఫ్రాన్స్ తో మొరాకో తలపడనుంది.
ఇరు జట్లలో ఏది విజయం సాధిస్తే దానితో కప్ కోసం యుద్దం చేయనుంది అర్జెంటీనా. ఇదిలా ఉండగా ఎనిమిది ఫిఫా వరల్డ్ కప్ లలో ఏకంగా ఆరుసార్లు అర్జెంటీనా ఫైనల్ కు చేరుకోవడం విశేసం. కాగా 2018లో రన్నరప్ గా ఉన్న క్రొయేషియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
Also Read : అర్జెంటీనా అరుదైన ఘనత