Argentina VS Netherlands : మెరిసిన మెస్సీ సెమీస్ కు అర్జెంటీనా

మ్యాజిక్ చేసిన స్టార్ ఫుట్ బాల‌ర్

Argentina VS Netherlands : ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా 2022 వ‌ర‌ల్డ్ క‌ప్ లో మెస్సీ మెరిశాడు. మ‌రోసారి త‌న అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. త‌న జ‌ట్టును సెమీస్ కు చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో నెద‌ర్లాండ్స్ తో జ‌రిగిన మ్యాచ్ అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది. చివ‌రి దాకా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగింది.

పెనాల్టీ షూటౌట్ లో 4-3 తేడాతో గెలుపొది సెమీస్ కు చేరింది. ఇదిలా ఉండ‌గా మ్యాచ్ లో భాగంగా ఇరు జ‌ట్లు 2-2 గోల్స్ తో స‌మంగా నిలిచాయి. అద‌న‌పు స‌మ‌యం ఇచ్చినా ఉప‌యోగించు కోలేక పోయారు. దీంతో అంపైర్లు పెనాల్టీ షూటౌట్ కు ఓకే చెప్పారు. ఇక షూటౌట్ లో నెద‌ర్లాండ్స్ మూడు గోల్స్ సాధించింది.

అనంత‌రం అర్జెంటీనా నాలుగు గోల్స్ సాధించింది. సెమీస్ కు ఎంట‌రైంది. మ్యాచ్ ప్రారంభంలో 35వ నిమిషంలో అర్జెంటీనా మొద‌టి గోల్ చేసింది. 74వ నిమిషంలో మెస్సీ సూప‌ర్ గోల్ సాధించాడు. దీంతో అంతా అర్జెంటీనా ఈజీగా విజ‌యం సాధిస్తుంద‌ని అనుకున్నారు.

కానీ కొద్ది సేప‌ట్లో ఆట ముగుస్తుందని అనుకున్న స‌మ‌యంలో నెద‌ర్లాండ్స్ ఊహించ‌ని రీతిలో దూసుకు వ‌చ్చింది. వెఘోర్న్స్ ఏకంగా రెండు గోల్స్ చేసి షాక్ ఇచ్చాడు. వీటిని 83వ నిమ‌షంలో, 101 నిమిషంలో చేశాడు. పెనాల్టీ షూటౌట్ లో నెద‌ర్లాండ్స్(Argentina VS Netherlands) మూడు గోల్స్ కొడితే అర్జెంటీనా అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుని నాలుగు గోల్స్ సాధించింది.

మ‌రో క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో క్రొయేషియా బ్రెజిల్ కు షాక్ ఇచ్చింది.

Also Read : ఆఖ‌రి మ్యాచ్ లోనైనా రాణిస్తారా

Leave A Reply

Your Email Id will not be published!