Argentina Win FIFA : మెస్సీ కల సాకారం అర్జెంటీనా విజయం
మూడుసార్లు ఫిపా వరల్డ్ కప్ విజేత
Argentina Win FIFA : ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కల సాకారమైంది. తను తప్పుకునే లోపు అర్జెంటీనాకు(Argentina Win FIFA) వరల్డ్ కప్ తీసుకు రావాలన్న కోరిక నెరవేరింది. కోట్లాది అభిమాలను ఆశలను నిజం చేస్తూ ఖతార్ లోని దోహాలో జరిగిన ఫైనల్ పోరులో ఫ్రాన్స్ ను ఓడించి వరల్డ్ కప్ ను సగర్వంగా ముద్దాడాడు. తన సుదీర్ఘ కాలపు మధురమైన ఫుట్ బాల్ ప్రయాణాన్ని అత్యంత సంతోషకరంగా ముగించాడు.
ఇక ఫైనల్ పోరాటం అద్భుతంగా సాగింది. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం విస్తు పోయేలా చేసింది. మెస్సీ మ్యాజిక్ తో తాను మెస్మరైజ అయ్యానని పేర్కొన్నారు. ఇక మ్యాచ్ ప్రారంభంలోనే అర్జెంటీనా దాడి చేసింది. ద్వితీయార్థంలో ఫ్రాన్స్ ఆధిక్యతను ప్రదర్శించింది. అయితే మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠను రేపుతూ సాగింది. చివరి దాకా ఎవరు గెలుస్తారనే దానిపై టెన్షన్ నెలకొంది.
ఫైనల్ మ్యాచ్ లో లియోనెల్ మెస్సీ తొలి గోల్ సాధించి శుభారంభం అందించాడు. అదే ఊపుతో మిగతా ఆటగాళ్లు దాడి చేయడం ప్రారంభించారు. ఇరు జట్లు ఆట ముగిసే సమయానికి సమంగా నిలిచాయి. దీంతో అదనపు సమయం ఇచ్చినా అదే ఫలితం చోటు చేసుకుంది. దీంతో పెనాల్టీ షూటౌట్ ఇచ్చారు.
అర్జెంటీనా 4 గోల్స్ చేస్తే ఫ్రాన్స్ కేవలం 2 గోల్స్ మాత్రమే చేయగలిగింది. మొత్తంగా అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. దీంతో మెస్సీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జట్టు సభ్యులతో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నాడు.
Also Read : ఫిఫా వరల్డ్ కప్ ను ముద్దాడిన మెస్సీ