Arindam Bagchi : చైనా అడ్డుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం

విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి

Arindam Bagchi : ఐక్య రాజ్య స‌మితిలో చైనా అనుస‌రించిన ప‌ద్ద‌తిపై తీవ్రంగా తప్పు ప‌ట్టింది భార‌త దేశం. మ‌సూద్ అజార్ సోద‌రుడిపై చ‌ర్య‌ను చైనా నిలిపి వేయ‌డాన్ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఈ సంద‌ర్బంగా అంత‌ర్జాతీయ స‌మాజం ఒకే స్వ‌రంలో మాట్లాడ‌లేక పోయిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు భార‌త దేశ విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి(Arindam Bagchi) .

చైనా చ‌ర్య పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మైన‌దిగా పేర్కొన్నారు. జైషే మ‌హ్మ‌ద్ సెకండ్ ఇన్ క‌మాండ్ అబ్దుల్ రౌఫ్ అస్గ‌ర్ పై ఆంక్ష‌లు విధించేందుకు ఐక్య రాజ్య స‌మితిలో భార‌త్ – అమెరికా సంయుక్తంగా చ‌ర్య తీసుకోవాల‌ని కోరాయి.

కానీ చైనా అడ్డుకుంది. భార‌త దేశం ముందు నుంచీ ఉగ్ర‌వాదాన్ని వ్య‌తిరేకిస్తూ వ‌స్తోంది. టెర్ర‌రిజం పేరుతో ఆయా దేశాల‌ను టార్గెట్ చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. అంతే కాదు శాంతి కోసం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

మ‌సూద్ అజ‌ర్ భార‌త్ పై దాడికి పాల్ప‌డ్డాడు. ఉగ్ర‌వాదం నుంచి ఒక్క భార‌త్ కే కాదు యావ‌త్ ప్ర‌పంచానికి ప్ర‌మాద‌క‌రం. అది ఏ రూపంలో ఉన్నా దానిని మొగ్గ‌లోనే తుంచి వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ ప‌డ్డారు అరింద‌మ్ బాగ్చి(Arindam Bagchi) .

కాగా యావ‌త్ ప్ర‌పంచం ఒకే తాటిపైకి రావాలి. కానీ ముందుకు రాక పోవ‌డం, ఒకే గొంతును వినిపించ‌క పోవ‌డం దారుణమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అరింద‌మ్ బాగ్చి. అబ్దుల్ రవూఫ్ అస్గ‌ర్ అనేక ఉగ్ర‌వాద దాడులకు ప్లాన్ చేశాడ‌ని, వాటిలో పాల్గొన్నాడ‌ని ఆరోపించారు.

వీటిలో ఇండియ‌న్ ఎయిర్ లైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్ కూడా ఉంద‌న్నారు. అంతే కాదు 2001లో భార‌త పార్ల‌మెంట్ పై దాడి, ప‌ఠాన్ కోట్ లో భార వైమానిక ద‌ళ స్థావ‌రంపై దాడి కూడా ఉంద‌న్నారు.

Also Read : స‌ల్మాన్ ర‌ష్డీపై ఫ‌త్వాకు 33 ఏళ్లు

Leave A Reply

Your Email Id will not be published!