Manoj Pandey : స‌రిహ‌ద్దు ఉద్రిక్తం ఆర్మీ చీఫ్ ఆగ్ర‌హం

ల‌డ‌ఖ్ లో దూసుకు వ‌స్తున్న డ్రాగ‌న్

Manoj Pandey : జిన్ పింగ్ మ‌ళ్లీ ప్రెసిడెంట్ అయ్యాక చైనా త‌న దూకుడు మ‌రింత పెంచింది. ప్ర‌ధానంగా భార‌త స‌రిహ‌ద్దులోని ల‌డ‌ఖ్ వ‌ద్ద త‌న తీరు మార్చు కోవ‌డం లేదు. క‌య్యానికి కాలు దువ్వుతోంది. కేంద్రంలోని స‌ర్కార్ చిలుక ప‌ల‌కులు పలుకుతున్నా వాస్త‌వానికి అక్క‌డ ప‌రిస్థితి దారుణంగా ఉంది.

ఇది ప్ర‌తిపక్షాలు ఆరోపిస్తున్నాయ‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే. సాక్షాత్తు భార‌త దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ ఇందుకు సంబంధించి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తూర్పు ల‌డ‌ఖ లో చైనా దూకుడు గా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డ్డారు. నియంత్ర‌ణ రేఖ (ఎల్ఏసీ) వ‌ద్ద చైనా త‌న ఆర్మీని త‌గ్గించ లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితి కంట్రోల్ లో ఉన్నా ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు ఆర్మీ చీఫ్ మ‌నోజ్ పాండే(Manoj Pandey). అయితే డెంచోక్ , డెప్సాంగ్ ప్రాంతంలో చోటు చేసుకున్న వివాదానికి సంబంధించి ప‌రిష్కారం కోసం చైనాతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సుముఖంగా ఉన్నామ‌ని స్పష్టం చేశారు ఆర్మీ చీఫ్‌.

ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు చైనా త‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని. ఇక ల‌ఢ‌ఖ్ తూర్పు ప్రాంతంలో చైనా హెలిపాడ్లు, ఎయిర్ ఫీల్డ్ , రోడ్ల నిర్మాణం చేప‌డుతోంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నో పాండే(Manoj Pandey) స్పందించిన తీరు, చేసిన కామెంట్స్ మ‌రింత క‌ల‌వ‌రానికి గురి చేసేలా ఉన్నాయి.

ఓ వైపు చైనా స్నేహం పేరుతోనే మ‌రో వైపు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం విశేషం.

Also Read : ఈ గిరిపుత్రుడు అమెరికా మెచ్చిన‌ సైంటిస్ట్

Leave A Reply

Your Email Id will not be published!