Ayodhya : అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కు భారీ ఏర్పాట్లు

జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట

Ayodhya : అయోధ్య లోని తీన్ కళాశాలయ పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి, తీన్ కళాశాలయంలోనే రాముడుతో సహా నలుగురు సదరులకు గురువు వసిష్ఠుడు విద్య నేర్పించారు. ఒకపక్క అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుండడంతో ప్రాముఖ్యత కలిగిన తీన్ కళాశాలయాన్ని కూడా పునరుద్ధరిస్తున్నారు అధికారులు.

Ayodhya Ram Mandir Updates

అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపనకు ముందు రామ భక్తులు యాత్రలు చేపట్టారు, రాముని విగ్రహాన్ని రథంపై పెట్టి ఊరురా తిరుగుతున్నారు. తాజాగా కాన్పూర్లో జై శ్రీ రామ్ అంటూ డాన్స్ చేస్తూ యాత్ర నిర్వహించారు, జనవరి 22న అయోధ్యలో దేశ నలుమూలలకు చెందిన పలువురు కళాకారులు ప్రదర్సనలు ఇవ్వనున్నారు. ఈ ఉత్సవంలోని, భూపాల్ కు చెందిన ‘ఢమరు’ బృందం పాల్గొననుంది.

108 మంది సభ్యుల ‘ఢమరు’ బృందం అయోధ్యలో(Ayodhya) ప్రదర్శన ఇవ్వనుంది, జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ఇతర విఐపీల సమక్షంలో వీరి ప్రదర్శన సాగనుంది. ఇక అయోధ్య సందర్శన కోసం చూస్తున్న భక్తులకోసం రైల్వేశాఖ అదనపు రైళ్లను నడపనుంది. అయోధ్యకు 30 రైళ్లు నడుస్తూ ఉండగా, జనవరి 22నుంచి మరో 37 రైళ్లు తోడవుతున్నాయి. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి.

ఇక భద్రత పరంగా చూస్తే అయోధ్య ఆలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగరమంతా సీసీ కెమెరాలతో నింపేశారు. డ్రోన్లద్వారా నిఘా పెడుతున్నారు. ఏటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం రిహార్సల్స్ కూడా చేసారు. అలాగే కృత్రిమ మేధస్సు (Artificial intelligence) సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయం వద్ద నిఘా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Also Read : CM Revanth met UPSC Chairman: యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ !

Leave A Reply

Your Email Id will not be published!