Statue Of Equality : శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన శ్రీరామనగరం ఆశ్రమం(Statue Of Equality )దేదీప్యమానంగా వెలుగుతోంది.
యావత్ దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్త బాంధవులతో అలరారుతోంది. ఎటు చూసినా జై శ్రీమన్నారాయణుడి జపమే. అదే మూల మంత్రమై భక్తులను పారవశ్యంలోకి ముంచెత్తుతోంది.
ఏది తప్పు ఏది ఒప్పు ఏది సత్యం ఏది అసత్యం ఏది ధర్మం ఏది అధర్మం అన్నది తెలుసు కోవాలంటే ముందు నిన్ను నీవు సంస్కరించు కోవాలన్నది మూల మంత్రం.
ఆది గురువుగా భావించే శంకరాచార్యుల కంటే ముందే వెయ్యేళ్ల కిందట శ్రీ భగవద్ రామానుజాచార్యులు ఈ భువిపై వెలిశారు. తనను భగవంతుడిగా కొలవమన లేదు. కానీ సమతను కోరుకున్నారు.
సర్వ ప్రాణులు సమానమేనని చాటారు. గురువు బోధించిన మంత్రం అందరికీ కావాలని ఆనాడు నినదించాడు. పండితులేనా మనుషులు మరి పామరులు మనుషులు కాదా అని నిలదీశారు.
ఎవరు తెలివి కలవారో వారే బ్రాహ్మణులు అని చాటి చెప్పాడు. తనకు విగ్రహం కావాలని కోరు కోలేదు. కానీ సమస్త మానవాళి సమానమేనని స్పష్టం చేశాడు. శ్రమజీవులకు కూడా దేవాలయ ప్రవేశం ఉండాలన్నాడు.
దైవం అందరికీ ఒక్కటేనని ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ కాదని చాటాడు శ్రీ రామానుజుడు. కానీ ఇవాళ ఏర్పాటు చేసిన సమతామూర్తి కేంద్రం(Statue Of Equality )స్పూర్తిని కలిగించే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందుకు వీవీపీలు క్యూ కట్టారు.
Also Read : ముచ్చింతల్ కు ఆర్ఎస్ఎస్ చీఫ్ రాక