Tarun Chug : అర్ష్ దీప్ సింగ్ దేశానికి గర్వకారణం
స్పష్టం చేసిన భారతీయ జనతా పార్టీ
Tarun Chug : భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్(Tarun Chug) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పాకిస్తాన్ చేతిలో ఓటమికి అర్ష్ దీప్ కారణమంటూ ట్రోలింగ్ చేస్తున్న దానిపై స్పందించారు.
అర్ష్ దీప్ సింగ్ భారత దేశానికి గర్వకారణమని పేర్కొన్నాడు. ప్రతి భారతీయుడు అతడికి వెన్నుదన్నుగా ఉంటాడని తెలిపాడు. అతడు పంజాబ్ నుండి ఎదుగుతున్న స్టార్. అతడిపై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
ప్రధానంగా అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh) ను టార్గెట్ చేస్తూ విద్వేష పూరిత వ్యాఖ్యలు లేదా పోస్ట్ లు చేసే వారిపై కఠినమైన , చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఐ స్టాండ్ విత్ అర్ష్ దీప్ హ్యాష్ ట్యాగ్ కు తన ట్వీట్ ను కూడా జోడించాడు చుగ్. కొందరు వికీపిడియా లో అతడి ప్రొఫైల్ ను మార్చడం, ఖలిస్తాన్ అని పేర్కొనడంతో తీవ్ర దుమారం రేగింది.
ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ వెంటనే స్పందించింది. వికీ పీడియా మేనేజర్లకు నోటీసులు జారీ చేసింది. వెంటనే తమ పేజీలో ఖలిస్తాన్ అనే పదాన్ని తొలగించారు.
దాని స్థానంలో పంజాబ్ అని చేర్చారు. ఇదిలా ఉండగా అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh) పంజాబ్ లోని మొహాలీకి చెందిన ఆటగాడు. ఇటీవల ఐపీఎల్ లో , వివిధ టూర్ లలో సత్తా చాటాడు.
బౌలింగ్ పరంగా సూపర్ గా రాణించాడు. కానీ పాకిస్తాన్ తో చేతులెత్తేశాడు. దీంతో ట్రోల్ కు గురయ్యాడు. ఇదే విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
Also Read : అర్ష దీప్ పేరెంట్స్ కు ఆప్ భరోసా