Arshdeep Singh Stumps : సింగ్ దెబ్బకు విరిగిన వికెట్లు
పంజాబ్ స్టార్ పేసర్ బిగ్ షాక్
Arshdeep Singh Stumps : ముంబై వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది పంజాబ్ . నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగింది ముంబై ఇండియన్స్. చివరి ఓవర్ దాకా తీసుకు వచ్చారు ముంబై బ్యాటర్లు కామెరాన్ , సూర్య కుమార్ యాదవ్. ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కామెరాన్ 67 రన్స్ తో సత్తా చాటితే సూర్య కుమార్ యాదవ్ 57 పరుగులతో రెచ్చి పోయాడు. ఇద్దరూ కలిసి ముంబై ఇండియన్స్ ను విజయపు అంచుల వరకు తీసుకు వచ్చారు. 20 ఓవర్ లో 16 పరుగులు కావాల్సి వచ్చింది గెలిచేందుకు ముంబై ఇండియన్స్ కు.
స్టాండింగ్ కెప్టెన్ సామ్ కరన్ తెలివిగా అర్ష్ దీప్ సింగ్ కు బౌలింగ్ ఇచ్చాడు. భారీ షాట్స్ కోసం ప్రయత్నం చేశారు. చివరి ఓవర్ లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన 2 వికెట్లు తీశాడు. విచిత్రం ఏమిటంటే ఆ రెండు మిడిల్ స్టంప్ వికెట్లు అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh Stumps) దెబ్బకు విరిగి పోయాయి.
దీంతో 13 పరుగుల తేడాతో ముంబైపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక సింగ్ కింగ్ గా మారాడు. 4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ప్రస్తుతం విరిగిన వికెట్లకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : పంజాబ్ దెబ్బకు ముంబై విలవిల