Arundhati Roy : దేశం వెనక్కి వెళుతున్న విమానం
అరుంధతీ రాయ్ సంచలన కామెంట్స్
Arundhati Roy : ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ సంచలన కామెంట్స చేశారు. భారత దేశం గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఆఫ్ టుడే గురించి ఎ షేమ్ అని మండిపడ్డారు.
1960 సంవత్సరంలో సంపద, భూమి పునః పంపిణీ కోసం విప్లవాత్మక మార్పుల కోసం ఉద్యమించే వారు నాయకులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆనాడు ఓట్లు అడిగిన వారు ఇప్పుడు 5 కిలోల బియ్యం , ఒక కిలో ఉప్పు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందుతున్నారని అరుంధతీ రాయ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నేటి భారత దేశం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సంచలనమైన రీతిలో సమాధానం ఇచ్చారు అరుంధతీ రాయ్. ఈ దేశం ఇప్పుడు ఎలా ఉందంటే వెనుకకు ఎగురుతున్న విమానం లాగా ఉందన్నారు.
దీని అర్థం ఏమిటంటే ముందుకు వెళుతున్న విమానం అనుకున్న లక్ష్యానికి , ప్రాంతానికి చేరుతుంది. కానీ వెనక్కి ఫ్లైట్ వెళుతుండడం అంటే నాశనం కావడమేనని పేర్కొన్నారు. అరుంధతీ రాయ్(Arundhati Roy) ఒక రకంగా తీవ్రంగా దేశాన్ని హెచ్చరించారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త జి.ఎన్. సాయిబాబా కవితలు, లేఖల ఎంపిక చేసిన వై డూ యూ ఫ్లైయర్ మై వే సో మచ్ పుస్తకావిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి రచయిత్రి అరుంధతీ రాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంపద, భూమి పునః పంపిణీ కోసం ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారు ఇప్పుడు ఓట్లు అడిగే నీచ స్థాయికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె భారత దేశ న్యాయ వ్యవస్థ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. కులం, తరగతి, లింగం , జాతి ఆధారంగా చట్టాలు వేర్వేరుగా వర్తించ బడతాయని పేర్కొన్నారు.
Also Read : హిందీ జాతీయ భాష – కిషన్ రెడ్డి