Arvind Kejriwal : అంబేద్కర్ ఆదర్శం విద్యతోనే వికాసం
దేశానికి చదువు అత్యంత అవసరం
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్య తోనే వికాసం అలవడుతుందన్నారు. లేక పోతే సమాజానికి తీరని నష్టం చేసిన వాళ్లం అవుతామని చెప్పారు. ఆప్ సర్కార్ విద్యా రంగానికి, ఆరోగ్య రంగానికి ప్రయారిటీ ఇస్తుందన్నారు. చదువు ఒక్కడే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. ఈ సందర్బంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన మహోన్నత మానవుడని కొనియాడారు.
Arvind Kejriwal Words
ఎవరూ కూడా తనకు పూలమాలలతో సత్కరించ వద్దని ఆనాడు కోరారని , కేవలం చదువు కోవాలని , విద్య ద్వారానే మనిషి మహోన్నత మానవుడిగా రూపు దిద్దుకుంటారని పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే పిల్లలకు చదువు చెప్పాలని పిలుపునిచ్చారు సీఎం.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఆనాడు కటిక పేదరికం అనుభవించాడని, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడని, అవమానాలు తట్టుకుని నిలబడ్డాడని కొనియాడారు. అయినా ఎక్కడా ఎవరి పట్లా కోపాన్ని ప్రదర్శించ లేదన్నారు. తాను ఎదగడానికి కారణమైంది కులం , మతం కాదన్నారు. కేవలం చదువు మాత్రమే తనను ఇంతటి వాడిని చేసిందన్నారు. ఇది అంబేద్కర్ అసలైన చరిత్ర అని పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్.
ఈ బడిలో చదివిన తర్వాత మీ పిల్లలు కూడా కుటుంబానికి , సమాజానికి, దేశానికి మంచి పని చేస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ పాఠశాలకు తాను బాబా సాహెబ్ పేరు పెట్టనున్నట్లు చెప్పారు.
Also Read : Chandrababu Naidu Ambati : అంబటి నువ్వు మంత్రివేనా