Arvind Kejriwal : ఆటో డ్రైవర్ ఇంట్లో కేజ్రీవాల్ భోజనం
అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడా తగ్గడం లేదు. తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి పంజాబ్ లో పాగా వేసిన ఆప్ దేశ మంతటా విస్తరించే పనిలో పడింది.
ఇందులో భాగంగా గుజరాత్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే పలుసార్లు పర్యటించారు. ఒక్కసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు.
అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఎలాగైనా ఈసారి గుజరాత్ లో పాగా వేయాలని డిసైడ్ అయ్యారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఆయన రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలో ఓ ఆటో డ్రైవర్ తన ఇంటికి రావాలని కోరారు. డ్రైవర్ కోరికను మన్నించాచరు కేజ్రీవాల్. అతడి ఆటోలోనే బయలు దేరేందుకు సిద్దమయ్యారు.
దీంతో గుజరాత్ పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. కేజ్రీవాల్ , పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఆటోలో వెళ్లేందుకు వీలు లేదంటూ అభ్యంతరం చెప్పారు.
తాను అందరి లాంటి సీఎంను కానని , తనకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. కాగా ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లిన సీఎంను పోలీసులు అడ్డుకున్నారు.
ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు ఖాకీలు అంగీకరించడంతో కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లాడు. అంతకు ముందు ఆటో డ్రైవర్లను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
ఈ సందర్భంగా నేను మీ అభిమానని, పంజాబ్ లో ఓ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. మరి మా ఇంటికి వస్తారా అని డ్రైవర్ విక్రమ్ దంతానీ అడిగాడు సీఎంను. అందుకు ఒప్పుకున్నారు కేజ్రీవాల్. ప్రస్తుతం ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : భారత్ జోడో యాత్ర పబ్లిసిటీ స్టంట్ – సీపీఎం