Arvind Kejriwal : అక్టోబర్ 6న ప్రజలతో నేరుగా మాట్లాడే కార్యక్రమం
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది...
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జనతా కా అదాలత్‌ను మరోసారి నిర్వహించనున్నారు. అక్టోబర్ 6వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని చత్రశాల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన ఇదే కార్యక్రమాన్ని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) న్యూఢిల్లీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రజలతో నేరుగా ప్రభుత్వం సంబంధాలు కలిగి ఉండేలా ఈ జనతా కా అదాలత్ కార్యక్రమాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం వేదికగా ప్రజలు.. తమ సమస్యలను ప్రభుత్వంలోని మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో నేరుగా విన్నవించుకోవచ్చు. ప్రజలు, ప్రభుత్వం మధ్య దూరాన్ని తగ్గించుకొనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
Arvind Kejriwal Comment…
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించింది. ఈ కేసులో ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా ఎక్కడా సంతకం చేయవద్దంటూ సీఎం కేజ్రీవాల్‌కు షరతు సైతం కోర్టు విధించింది. దీంతో జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్.. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జనతా కా అదాలత్‌ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు ప్రధాని నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ మరునాడు ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ పక్షం సమావేశమైంది. దీంతో అతిషిని ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశమ్యారు. అందులోభాగంగా తన ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా లేఖతోపాటు అతిషిని సీఎంగా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న పత్రాలను ఢిల్లీ ఎల్జీకి అందజేశారు. దాంతో ఢిల్లీ సీఎంగా అతిషి బాధ్యతలు చేపట్టారు. ఇక అక్టోబర్ 6వ తేదీన చాత్రశాల్ స్టేడియంలో ఈ ‘జనతా కా అదాలత్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Also Read : AP Deputy CM : షెడ్యూల్ కు ముందే ఏపీ డిప్యూటీ సీఎం తిరుమల పర్యటనలో కీలక మార్పులు