Arvind Kejriwal : సీఎం ప్ర‌శంస‌నీయం కేజ్రీవాల్ భావోద్వేగం

పంజాబ్ సీఎం కు దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు

Arvind Kejriwal : అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన త‌న కేబినెట్ లోని మంత్రిని ఏకంగా పీకి పారేశారు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్. ఆ మంత్రి ఎవ‌రో కాదు ఆరోగ్య శాఖ మంత్రిగా కొలువు తీరిన విజ‌య్ సింగ్లా. టెండ‌ర్ల‌లో 1 శాతం క‌మీష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

ఇందులో మంత్రి స‌హ‌చ‌రులు కూడా ఉన్నారు. ఈ విష‌యంపై ఓ అధికారి నేరుగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ఫిర్యాదు చేశారు. విష‌యం తెలిసిన సీఎం భ‌గ‌వంత్ మాన్ రంగంలోకి దిగారు.

ఆ అధికారి సాయంతో ఆరోగ్య మంత్రిపై నిఘా పెంచారు. విచార‌ణ జ‌రిపించారు. ప‌క్కా ఆధారాలు ల‌భించాయి. దీంతో మంగ‌ళ‌వారం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు.

అంద‌రి స‌మ‌క్షంలోనే ఆరోగ్య మంత్రి విజ‌య్ సింగ్లాను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌కటించారు. ఇందుకు సంబంధించిన ఆధారాల‌ను సీఎం స్వ‌యంగా బ‌య‌ట పెట్టారు.

అంతే కాదు సింగ్లాపై కేసు న‌మోదు చేయాలిన భ‌గ‌వంత్ మాన్ పోలీసుల‌ను ఆదేశించారు. వెంట‌నే రంగంలోకి దిగిన అవినీతి నిరోధ‌క శాఖ సింగ్లాను అదుపులోకి తీసుకుంది.

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇది రెండోసారి. ఒక కేబినెట్ మంత్రిని అవినీతి పేరుతో తొల‌గించారు. 2015లో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)  త‌న కేబినెట్ లో మంత్రిపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో చ‌ర్య తీసుకున్నారు.

ప్ర‌స్తుతం మాన్ తీసుకున్న నిర్ణ‌యం దేశాన్ని ప్ర‌భావితం చేస్తోంది. ఇలాంటి నాయ‌కులే దేశానికి అవ‌స‌ర‌ని పేర్కొన్నారు ఆప్ క‌న్వీన‌ర్, సీఎం కేజ్రీవాల్. ఇవాళ త‌న‌కు ఆనందంగా ఉంద‌ని, భ‌గ‌వంత్ మాన్ ను చూసి ఉద్వేగానికి లోన‌య్యాన‌ని పేర్కొన్నారు.

ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా సైతం సీఎంను అభినందించారు. ఈ దేశంలో అవినీతి ర‌హిత ప్ర‌భుత్వం ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal).

Also Read : జ‌యహో సీఎం భ‌గ‌వంత్ మాన్

Leave A Reply

Your Email Id will not be published!