Arvind Kejriwal : లా అండ్ ఆర్డర్ లో కేంద్రం విఫలం
సీఎం అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్
Arvind Kejriwal : కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ ను మెరుగు పరిచేందుకు కేంద్రం వద్ద ఎలాంటి పటిష్టవంతమైన ప్లాన్ లేదన్నారు. ఒక్క సమావేశం తో ఏదైనా సమస్య పరిష్కారం కాదని తెలుసు కోవాలన్నారు. ప్రధాన మంత్రికి స్వంత ప్రచారంపై ఉన్నంత శ్రద్ద ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ ను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు కోవడం లేదన్నారు. ప్రజలు తమను ఎన్నుకున్నా దేశ రాజధానిలో శాంతి భద్రతలు తమ వైపున ఉండవని పేర్కొన్నారు.
ఢిల్లీలో పట్ట పగలు వీధుల్లో దోపడీలు జరుగుతున్నాయని, రౌడీలు యధేశ్చగా తిరుగుతున్నారని ఆరోపించారు. అయినా చీమ కుట్టినట్టు కేంద్రానికి కావడం లేదన్నారు. బీజేపీ కొలువు తీరిన మణిపూర్ లో సైతం మంటలు ఇంకా చల్లార లేదని ఎద్దేవా చేశారు. దీనికంతటికీ కారణం అక్కడ కాషాయం కొలువు తీరి ఉండడమేనని పేర్కొన్నారు.
ఎందుకని ఇప్పటి వరకు మణిపూర్ మంటల్లో కాలి పోతున్నా, 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా , 300 మంది గాయపడినా , 60 వేల మంది నిరాశ్రయులైనా మోదీ నోరు విప్పడం లేదంటూ ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్. తమకు పోలీసులను అప్పగిస్తే తాట తీస్తామన్నారు సీఎం.
Also Read : YS Sharmila KTR : కేసీఆర్ ను జైల్లో ఎందుకు పెట్టొద్దు
