Arvind Kejriwal : టైమ్స్ ప్ర‌శంసిస్తే సీబీఐ దాడి చేస్తోంది

మోదీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన కేజ్రీవాల్

Arvind Kejriwal : ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ లాంటి ప‌త్రిక‌లు ఢిల్లీ ప్ర‌భుత్వ ప‌నిత‌రును మెచ్చుకున్నాయి.

డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా నిర్వ‌హించ‌న ఎక్సైజ్ శాఖ‌లో అవినీతి చోటు చేసుకుందంటూ ఆధారాలు లేకుండా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ దాడి చేసింది.

దీనిని తీవ్రంగా ఖండించారు ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది ఢిల్లీ ఎడ్యుకేష‌న్ మోడ‌ల్ ( ఢిల్లీ విద్యా విధాన న‌మూనా ). ఇత‌ర దేశాలు కూడా ప్ర‌శంసించాయి.

అభివృద్దిలో టాప్ లో ఉన్న సింగ‌పూర్ సైతం కితాబిచ్చింది. ఈ పాల‌సీ గురించి న్యూయార్క్ టైమ్స్ ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురించింది. మ‌నీష్ సిసోడియా ఫోటోతో ప్ర‌చ‌రించిన స‌క్సెస్ స్టోరీని కూడా ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తావించారు సీఎం.

టైమ్స్ ఓ వైపు ప్ర‌శంసిస్తోంటే కేంద్ర స‌ర్కార్ మ‌నీష్ సిసోడియా ఇంటికి ఇవాళ బ‌హుమానంగా సీబీఐని పంపింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో కూడా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఇలాగే దాడులు చేప‌ట్టాయి.

కానీ వాళ్ల‌కు ఏమీ దొర‌క‌లేద‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ ఎక్సైజ్పాల‌సీ 2021-22 కి సంబంధించి సీబీఐ శుక్ర‌వారం ఢిల్లీ డిప్యూటీ సీఎంను టార్గెట్ చేసింది.

సిసోడియా నివాసంతో స‌హా 10కి పైగా ప్రాంతాల్లో దాడులు చేప‌ట్టింది. ఇవాళ టైమ్స్ లో క‌థ‌నం ప్ర‌చురితం అయ్యింది. కానీ అదేరోజు సీబీఐ ఆయ‌న‌ను ప‌ల‌క‌రించింది.

సీబీఐకి స్వాగ‌తం ప‌లుకుతున్నాం. పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. గ‌తంలో ఎలాంటి ఆధారాలు దొర‌క‌లేదు. ఇప్పుడూ కూడా ఏమీ దొర‌క‌ద‌న్నారు.

Also Read : నాన్న మ‌ర‌ణంతో ఆర్మీలో చేర‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!