Arvind Kejriwal : ఢిల్లీ ఎన్నికలపై మాజీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై పోరుకు ఆప్, కాంగ్రెస్ చేతులు కలుపుతాయంటూ గతంలో ఊహాగానాలు వినిపించారు...
Arvind Kejriwal : వచ్చే ఏడాది మొదటల్లో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. వరుసగా మూడోసారి నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పొత్తులు లేకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.
Arvind Kejriwal Comments..
బీజేపీపై పోరుకు ఆప్, కాంగ్రెస్ చేతులు కలుపుతాయంటూ గతంలో ఊహాగానాలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో దీనిపై కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితిపై బీజేపీని తప్పుపట్టారు. ”శాంతిభద్రతలు అంశాన్ని నేను ప్రస్తావించిన తరువాతైనా అమిత్‌షా చర్యలు తీసుకుంటారని ఆశించాను. అందుకు బదులుగా పాతయాత్రలో నాపై దాడి జరిగింది. ద్రావకాన్ని నాపై విసిరారు. ఎలాంటి హాని జరగకపోయినా కానీ అది ప్రమాదకారి కావచ్చు” అని కేజ్రీవాల్ అన్నారు.
ఆప్ఎ మ్మెల్యే నరేష్ బల్యాన్‌ను శనివారం అరెస్టు చేశారని, ఆయన చేసిన నేరమల్లా గ్యాంగ్‌స్టర్ల బాధితుడు కావడమేనని కేజ్రీవాల్ చెప్పారు. గ్యాంగ్‌స్టర్ల నంచి డబ్బులు డిమాండ్ చేస్తూ ఆయనకు బెదిరింపులు వచ్చాయని, ఆయన అనేకసార్లు ఫిర్యాదులు కూడా చేశారని తెలిపారు. కాగా, కేజ్రీవాల్ గ్రేటర్ కైలాస్ ఏరియాలో పాదయాత్ర చేస్తుండగా ద్రావకంతో దాడి జరిగన విషయాన్ని ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సౌరభ్ భరద్వాజ్ ధ్రువీకరించారు. ఆ ద్రావకం స్పిరిట్ అని చెప్పారు. కేజ్రీవాల్‌కు హాని చేసే ఉద్దేశంతోనే ఈదాడి జరిగిందన్నారు. దాడికి యత్నించిన వ్యక్తి చేతిలోని ద్రావకం స్పిరిట్ వాసన వచ్చిందని, అతని మరో చేతిలో అగ్గిపెట్టి ఉందని వివరించారు.
Also Read : Minister Nadendla : కాకినాడ పోర్ట్ లో స్మగ్లింగ్ ఘటనపై భగ్గుమన్న మంత్రి నాదెండ్ల మనోహర్