Arvind Kejriwal : కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం
ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ సతీసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది...
Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. కుటుంబ సమేతంగా నిన్న తిరుమల కు చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీహరి సేవలో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి తిరుమలకు వచ్చిన కేజ్రీవాల్ రాత్రి అక్కడే బస చేశారు. ఉదయం వెంకన్న దర్శనం చేసుకున్నారు. లిక్కర్ స్కాం లో నమోదైన ఈడీ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చాక, తిరుమలేశుని దర్శనం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు కేజ్రీవాల్ దంపతులు.
Arvind Kejriwal Visited..
ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ సతీసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ తనకు శక్తి నివ్వాలని దేవదేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. అందరి అభివృద్ధి కోసం వేడుకున్నానని, చాలాకాలం తరువాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవుడిని ప్రార్థించానన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలిపిన కేజ్రీవాల్ ఈరోజు పెద్దలు కూడా పిల్లల్లా సంతోషంగా గడపాలన్నారు. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేజ్రీవాల్ దంపతులు తిరుపతి విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు.
Also Read : Sabarimala : శబరిమల భక్తుల సహాయార్థం ‘స్వామి’ పేరుతో అందుబాటులో చాట్ బాట్