Arvind Swamy : అర‌వింద్ స్వామి ఆస్తులు వేల కోట్లు

రూ. 3,300 కోట్లుగా అంచ‌నాతో ప‌రేషాన్

Arvind Swamy : ఎవ‌రీ అర‌వింద్ స్వామి అనుకుంటున్నారా. సినీ రంగానికి చెందిన వారు , ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ న‌టుడికి ఫిదా. ఇక ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. విచిత్రం ఏమిటంటే త‌న ఆస్తులు ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు రూ. 3 వేల కోట్ల‌కు పైగా ఉన్నాయని తెలుసుకుని విస్తు పోతున్నారు.

Arvind Swamy Properties

ఇక అర‌వింద్ స్వామి విష‌యానికి వ‌స్తే 1991లో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ళ‌ప‌తి సినిమాతో చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మ‌హా భార‌తం నుండి గొప్ప యోధుడు అర్జునుడి నుండి ప్రేర‌ణ పొందిన పాత్ర‌ను చిత్రీక‌రించిన ఈ చిత్రం విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు, వాణిజ్య ప‌రంగా స‌క్సెస్ అయ్యింది. ఈ ఒక్క మూవీతో మ‌రికొన్ని సినిమాలు ఛాన్స్ వ‌చ్చాయి.

ఇక డైరెక్ట‌ర్ తో కాంబినేష‌న్ కొన‌సాగించాడు అర‌వింద్ స్వామి(Arvind Swamy). దేశాన్ని ఒక ఊపు ఊపిన చిత్రాలు రోజా , బాంబేలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాడు. రోజా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాంబేలో మ‌నీషా కొయిరాల ఆక‌ట్టుకుంది. జాతీయ అవార్డు పొందిన మిన్సార క‌న‌వు చిత్రంలో కాజోల్ తో క‌లిసి న‌టించాడు

ప్రారంభంలో స‌క్సెస్ అయినా ఆ త‌ర్వాత ప‌రాజయం పాల‌య్యాయి. 2000 త‌ర్వాత న‌ట‌న‌కు పుల్ స్టాప్ పెట్టాడు అర‌వింద్ స్వామి. త‌న తండ్రి వీడీ స్వామి వ్యాపారంపై ఫోక‌స్ పెట్టాడు. 2005లో టాలెంట్ మాగ్జిమ‌మ్ ను ఏర్పాటు చేశాడు. 2022లో ఈ సంస్థ ఏకంగా రూ. 3,300 కోట్లు ఉండ‌డం విశేషం.

Also Read : Revanth Reddy : అంద‌రి చూపు రేవంత్ వైపు

Leave A Reply

Your Email Id will not be published!