Sameer Wankhede : ఆర్య‌న్ ఎఫెక్ట్ స‌మీర్ వాంఖెడేపై వేటు

కేసు దెబ్బ‌కు బ‌దిలీ చేసిన ప్ర‌భుత్వం

Sameer Wankhede : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ప్ర‌ముఖ న‌టుడు షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసు. ఈ కేసును న‌మోదు చేసింది, అత‌డిని జైలుకు పంపించేలా చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చెందిన ఉన్న‌తాధికారి స‌మీర్ వాంఖేడ్(Sameer Wankhede).

ఇప్ప‌టికే ఆర్య‌న్ ఖాన్ తో పాటు మ‌రో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డంతో జైలుకు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత ఆర్య‌న్ ఖాన్ కు బెయిల్ దొరికింది. చివ‌ర‌కు ఎన్సీబీ ప్ర‌త్యేక కోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

ఆర్య‌న్ ఖాన్ దోషి అని తేల్చేందుకు ఎలాంటి ఆధారాలు లేవ‌ని తెలిపింది. ఈ మేర‌కు న‌టుడి కొడుక్కి క్లీన్ చిట్ ఇచ్చింది.

ఇదే విష‌యంపై ఇటీవ‌ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో మంత్రి న‌వాబ్ మాలిక్ పై కొర‌డా ఝులిపించింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).

ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు స‌మీర్ వాంఖేడ్(Sameer Wankhede) పై. ఆయ‌న త‌ప్పుడు కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించి పోలీస్ అధికారి అయ్యాడంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

దీనిపై త‌న స‌ర్టిఫికెట్ ను జాతీయ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ కు స‌మ‌ర్పించారు. ఈ త‌రుణంలో ఎంతో ఉత్కంఠ రేపిన ఆర్య‌న్ ఖాన్ కేసు చివ‌ర‌కు ఉత్త‌ద‌ని తేల‌డంతో, కేవ‌లం కావాల‌ని వ్య‌క్తిగ‌త క‌క్ష‌తోనే స‌మీర్ ఇలా చేశాడన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ త‌రుణంలో స‌మీర్ వాంఖేడ్ పై వేటు ప‌డింది. ఎన్సీబీలో ఉన్న‌త స్థాయి పోస్టులో ఉన్న ఆయ‌న‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. స‌మీర్ ను చెన్నై లోని డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లో టాక్స్ పేయ‌ర్ స‌ర్వీస్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా బ‌దిలీ చేశారు.

Also Read : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!