Asaduddin Owaisi : జ్ఞానవాపి మ‌సీదు కేసుపై ఓవైసీ కామెంట్స్

80వ ద‌శ‌కంలోకి వెళ్లి పోయిన‌ట్లు అనిపిస్తోంది

Asaduddin Owaisi : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌కు తెర తీసిన జ్ఞాన వాపి మ‌సీదు కేసులో కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించింది యూపీలోని వార‌ణాసి కోర్టు. సింగిల్ జడ్జితో కూడిన ధ‌ర్మాస‌నం ముస్లింలు వేసిన పిటిష‌న్ ను తిర‌స్క‌రించింది.

ఐదుగురు హిందూ మ‌హిళ‌లు దాఖ‌లు చేసిన దావాపై విచార‌ణ చేప‌ట్టింది. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. హిందువులు పూజ‌లు చేసుకోవ‌చ్చంటూ తీర్పు చెప్పింది.

దీంతో దేశ వ్యాప్తంగా హిందువులు సంబురాల‌లో మునిగి పోయారు. ప్ర‌ధానంగా హిందూ ప‌రివార్ (బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , భ‌జ‌రంగ్ ద‌ళ్ ) లో ఆనందం చోటు చేసుకుంది.

అయితే దీనిని స‌వాల్ చేస్తూ అల‌హాబాద్ హైకోర్టుకు వెళ‌తామ‌ని ముస్లిం వ‌ర్గాలు పేర్కొన్నాయి. మొద‌ట ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్క‌డి నుంచి తిరిగి వార‌ణాసికి కేసును బ‌దిలీ చేసింది.

వార‌ణాసి కోర్టు మాత్ర‌మే దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోవాలంటూ స్పష్టం చేసింది. చివ‌ర‌కు తుది తీర్పు హిందూ మ‌హిళ‌ల‌కు అనుకూలంగా వ‌చ్చింది. దీనిపై ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) స్పందించారు.

కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వార‌ణాసి కోర్టు తీర్పు ను ప‌రిశీలిస్తే 80వ ద‌శ‌కంలో ఉన్న‌ట్టు త‌న‌కు అనిపిస్తోంద‌న్నారు. ఇది పూర్తిగా అసంబద్దంగా ఉంద‌న్న రీతిలో వ్యాఖ్యానించారు ఎంపీ.

భ‌విష్య‌త్తులో మ‌రిన్ని వ్యాజ్యాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు ఓవైసీ. మ‌సీదు ఆవర‌ణ‌లో ఏడాది పాటు పూజ‌లు చేసేందుకు అనుమ‌తిస్తూ ఇస్తు కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేస్తామ‌ని చెప్పారు.

Also Read : జాతీయ జెండా పార్టీల‌ది కాదు దేశానిది

Leave A Reply

Your Email Id will not be published!