Ashneer Grover : భారత దేశంలో టాప్ ఫిన్ టెక్ కంపెనీలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది భారత్ పే. అయితే గత కొంత కాలంగా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న అష్నీర్ గ్రోవర్(Ashneer Grover) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా అవినీతిని పక్కన పెడితే వ్యక్తిగత ప్రవర్తనపై రాద్ధాంతం చోటు చేసుకుంది. ఈ తరుణంలో కంపెనీ బోర్డు గ్రోవర్ కు ఎలాగైనా సరే చెక్ పెట్టాలని చూస్తోంది.
కంపెనీకి చెందిన టీంతో గ్రోవర్ పై విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా బోర్డు ఇండిపెండెంట్ గా ఇంకో టీంను కూడా నియమించింది.
ఈ విషయాన్ని గ్రహించిన అష్నీర్ గ్రోవర్(Ashneer Grover) తాను ఎందుకు వెళ్లి పోవాలంటూ, తనను తొలగించే పవర్స్ భారత్ పే బోర్డుకు లేదంటూ స్పష్టం చేశాడు. రూల్స్ ఏమిటో పరిశీలించకుండా తనపై చర్యలు తీసుకునే అధికారం ఎవరికీ లేదంటూ పేర్కొన్నారు.
అయినా గద్దె దించేందుకు ప్రయత్నాలు మరో వైపు కొనసాగుతున్నాయి. విచిత్రంగా మరో మెలిక కూడా పెట్టినట్లు టాక్.
తాను కంపెనీని వీడాలంటే రూ. 4 వేల కోట్లు ఇవ్వాలని అంత వరకు తానే భారత్ పే కు మేనేజింగ్ డైరెక్టర్ నంటూ పేర్కొనడం మార్కెట్ వర్గాలనే కాదు భారత్ పే బోర్డును కూడా విస్తు పోయేలా చేసింది.
తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఒట్టిదేనని కావాలని తనపై రూమర్స్ క్రియేట్ చేశారంటూ మండిపడుతున్నాడు అష్నీర్ గ్రోవర్. ఇదిలా ఉండగా భారత్ పేలో గ్రోవర్ కి 9.5 శాతం వాటా ఉంది.
దీని వాల్యూ భారత రూపాయల్లో చూసుకుంటే 21 వేల కోట్లు.
Also Read : క్రిప్టో లావాదేవీలకు బిగ్ షాక్