Asia Cup 2022 Squads : ఆసియా కప్ 2022 జట్లు..ఆటగాళ్లు
మెగా టోర్నీకి వేళాయెరా
Asia Cup 2022 Squads : ప్రపంచ వ్యాప్తంగా మరో మెగా టోర్నీకి రంగం సిద్దమైంది. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 17 దాకా ఆసియా కప్ -2022 జరగనుంది.
ఆసియా ఖండం పరిధిలో పలు జట్లు పాల్గొంటున్నా ప్రధానంగా పోటీ మాత్రం దాయాది దేశాలైన పాకిస్తాన్, ఇండియా జట్ల మధ్యే ఉండనుంది.
ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి టికెట్లు. ఇరు జట్ల మధ్య మూడుసార్లు మ్యాచ్ లు కొనసాగనున్నాయి. ఇక పాల్గొనే జట్లు, ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
టోర్నీ పరంగా గ్రూపులుగా విభజించారు. భారత్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు(Asia Cup 2022 Squads) ఉన్నాయి. ఈ ఐదు దేశాలతో పాటు క్వాలిఫయిర్స్ లో కువైట్, సింగపూర్, యూఏఈతో పాటు హాంకాంగ్ టీమ్ కూడా పాల్గొనబోతోంది.
జట్ల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. గ్రూప్ – ఏలో భారత్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి.
భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ,(Team India) కేఎల్ రాహుల్ వైఎస్ కెప్టెన్ గా ఉన్నారు. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ , రిషబ్ పంత్ , దినేశ్ కార్తీక్, హూడా, పాండ్యా, జడేజా, అశ్విన్ , చహల్ , బిష్ణోయ్ , భువీ, అర్ష్ దీప్ సింగ్ , ఆవేష్ ఖాన్ ఉన్నారు. స్టాండ్ బై ఆటగాళ్లుగా అయ్యర్, అక్షర్ పటేల్ , దీపక్ చాహర్ ఆడతారు.
పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజమ్ కెప్టెన్. షాబాద్ ఖాన్ , ఫకర్ జమాన్ , ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, రవూఫ్ , ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్ దిల్ షా , నవాజ్ , రిజ్వాన్ , వసీం జూనియర్ , నసీం షా, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్ , హుస్నైన్ ఉన్నారు.
ఇక గ్రూప్ -బిలో ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఉన్నాయి.
జట్ల పరంగా చూస్తే ఆఫ్గనిస్తాన్ జట్టులో మహ్మద్ నబీ కెప్టెన్, గుర్బాజ్ , జజాయ్, నజీబుల్లా, షాహిది, అఫ్సర్ జజాయ్, కరీం జనత్ , ఒమర్జాయ్ ,
సమీముల్లా, రషీద్ ఖాన్ , ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ మాలిక్, ఉల్ హక్, నూర్ అహ్మద్ , ముజీబ్ ఉర్ రెహమాన్ , జద్రాన్ , ఉస్మాన్ ఘని ఆడతారు. ఇక రిజర్వ్ ప్లేయర్లుగా కైస్ అహ్మద్ , అష్రఫ్ , మసూద్ ఉన్నారు.
ఇక బంగ్లాదేశ్ జట్టు పరంగా చూస్తే షకీబ్ అల్ హసన్ కెప్టెన్. అనముల్ హక్, రహీం, హుస్సేన్ , మొసద్దెక్ హుస్సేన్, మహ్మదుల్లా, హెహదీ హసన్ ,
సైపుద్దీన్ , రెహమాన్, నసూమ్ అహ్మద్ , సబీర్ రెహమాన్ , మీరజ్ , టస్కిన్ అహ్మద్ , ఎబాదత్ హుస్సేన్ , పర్వేజ్ ఎమాన్ , నయీయి ఆడతారు.
శ్రీలంక జట్టులో దసున్ షనక కెప్టెన్ . గుణ తిలక , నిశాంక, కుశాల్ మెండీస్ , చరిత్ అసలంక, భనుక రాజపక్స, బండారా, డిసిల్వా, హసరంగ, మహీశ్
తీక్షణ, వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, చమిక కరుణ రత్నే, మదుషంక, మథీష పతిరాణా, ఫెర్నాండో, తుషార, చండిమాల్ ఆడతారు.
క్వాలిఫయర్స్ పరంగా చూస్తే ఆడే జట్లు ఇలా ఉన్నాయి.
హాంకాంగ్ జట్టుకు నిజాకత్ ఖాన్ కెప్టెన్. కించిత్ షా, జీషన్ అలీ, అర్షద్ , హయత్ , అఫ్దాబ్ హుస్సేన్ , అతీక్ ఇక్బాల్ , ఎయిజాజ్ ఖాన్ , ఎహ్ సాన్ ఖాన్ ,
ఘజ్నాఫర్ మహ్మద్ , మెర్తజా, ధనుంజయ రావు, వాజిద్ షా, అయుశ్ శుక్లా, త్రివేది, వహీద్ ఆడతారు.
కువైట్ జట్టు కెప్టెన్ గా మహ్మద్ అస్లాం. నవాఫ్ అహ్మద్, ఆమిన్ , భావ్సర్ , అద్నన్ ఇద్రీస్ , కాషిఫ్ , శిరాజ్ ఖాన్ , మోనిబ్ , ఉస్మాన్ పటేల్ , యాసిన్
పటేల్ , కుద్దూస్ , సాందురవన్ , షఫీక్ , హరున్ షాహిద్ , ఎడ్సన్ సిల్వా, బిలాల్ తాహిర్ , అలీ జాఫర్ ఉన్నారు.
సింగపూర్ జట్టు కెప్టెన్ గా అంజద్ మెహబూబ్. రీజా గజ్నావి, జన్ ప్రకాశ్ , మన్ ప్రీత్ సింగ్ , వినోత్ బాస్కరన్, ఉచిల్, చంద్రమోహన్ , రంగరాజన్ , రూపర్ పురి, దేశాయి, జీవన్ సంతానం, విహాన్ మహేశ్వరి, ఆర్యవీర్ చౌదరి, ఆరిత్ర దత్తా ఆడతారు.
యూఏఈ జట్టు కెప్టెన్ గా రిజ్వార్ కెప్టెన్ కాగా సుల్తాన్ అహ్మద్ , సబీర్ అలీ, వ్రిత్య అరవింత్ , కసిఫ్ దావూద్ , జవార్ ఫరీద్ , బాసిల్ హమీద్ , జహూర్ ఖాన్ ,
ఆర్యన్ లక్రా, మెయిప్పన్ , రోహన్ ముస్తాఫా, ఫాహద్ నవాజ్ , అహ్మద్ రజా, అలీషాన్ ష రావు, జునైద్ సిద్దిఖీ, చిరాగ్ సూరి, వసీం ఉన్నారు.
Also Read : పంజాబ్ కింగ్స్ కోచ్ కుంబ్లేపై వేటు