Asia Cup 2022 : కేఎల్ రాహుల్ రాకతో కోహ్లీకి కష్టమేనా
ఆసియా కప్ కోసం జట్టు ఎంపికై ఉత్కంఠ
Asia Cup 2022 : పేలవమైన ప్రదర్శనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో అత్యంత గడ్డు పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు. ఆగస్టులో యూఏఈ వేదికగా ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ టోర్నీ జరగనుంది.
ఇప్పటికే దాయాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా ఆ జట్టును ప్రకటించాడు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన బీసీసీఐ మాత్రం ఇంకా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
2022-23 సంవత్సరానికి క్రికెట్ షెడ్యూల్ ను డిక్లేర్ చేసిన బీసీసీఐ ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇంకా క్లారిటీకి రావడం లేదు. ఆసియా కప్ లో ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రధానంగా విరాట్ కోహ్లీ ఉంటాడా ఉండడా అన్న అనుమానం ఎక్కువైంది. గాయం కారణంగా దూరంగా ఉన్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నయం కావడంతో తాను రెడీ అని ప్రకటించాడు.
ఇక మిగిలింది కోహ్లీనే. పూర్ పర్ ఫార్మెన్స్ కారణంగా పక్కన పెట్టడమే మంచిదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు సెలెక్టర్లకు. ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన పొట్టి ఫార్మాట్ టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది.
అప్పటి వరకు ఇది సన్నాహకంగా మారుతుందని భావిస్తోంది బీసీసీఐ. ఇక ఆసియా కప్(Asia Cup 2022) ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 దాకా దుబాయ్, షార్జా వేదికల్లో జరగనుంది.
చేతన్ శర్మ ఆధ్వర్యంలోని సెలెక్టర్ల కమిటీ ఆసియా కప్ కోసం 15 నుంచి 17 మందితో కూడిన ప్రాబబుల్స్ ను ఎంపిక చేయనున్నారు.
Also Read : పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ కు స్వర్ణం