Asia Cup 2023 Jay Shah : ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు
ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి
Asia Cup 2023 Jay Shah : కొత్త ఏడాదిలో రెండు మెగా టోర్నీలకు వేదిక కానుంది ఆసియా ఖండం. ఒకటి ఆసియా కప్ రెండోది వన్డే వరల్డ్ కప్ . ఈ రెండూ దాయాది దేశాలలో కొలువు తీరనున్నాయి. ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించనుండగా వన్డేకు సంబంధించి వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం వహించనుంది.
ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జే షా. ఈ మేరకు క్యాలెండర్ తెలిపారు. విచిత్రం ఏమిటంటే ఆసియా కప్(Asia Cup 2023) లో భారత్, పాకిస్తాన్ లు ఒకే గ్రూప్ లో ఉండనున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగనుంది.
క్వాలిఫయింగ్ జట్టుతో పాటు భారత్, పాకిస్తాన్ లు ఒకే గ్రూప్ లో ఉంటాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ జే షా స్పష్టం చేశారు. మరో గ్రూప్ లో బంగ్లాదేశ్ , శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ లు ఉంటాయని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు జే షా. గత ఏడాది 2022లో జరిగిన ఆసియా కప్ లోనూ ఒకే గ్రూప్ లో ఉండడం విశేషం.
విచిత్రం ఏమిటంటే ఫైనల్ కు పాకిస్తాన్ చేరుకుంది. శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఇదే సమయంలో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ లో భారత్ ఉన్నట్టుండి ఆశించిన మేర రాణించ లేక పోయింది. ఇక ఈసారి పాకిస్తాన్ లో జరగనున్న ఆసియా కప్ లో టీమిండియా పాల్గొన బోదంటూ ప్రకటించారు జే షా.
ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా లేక పోవడం కారణంగా పంపడం లేదన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే భారత దేశ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం వివరణ ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి.
Also Read : మహిళల ఐపీఎల్ పై సీఎస్కే ఫోకస్