Asia Cup Super-4 Schedule : ఆసియా కప్ సూపర్- 4 షెడ్యూల్
మరోసారి ఢీకొననున్న భారత్, పాక్
Asia Cup Super-4 Schedule : యూఏఈ వేదికగా జరుగుతున్న మెగా టోర్నీ ఆసియా కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, భారత్ , ఆఫ్గనిస్తాన్ సూపర్ -4కి అర్హత సాధించాయి.
ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో మరోసారి పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగనుంది. ఇదిలా ఉండగా మెగా సూపర్ -4లో భాగంగా ఇరు జట్లు(Asia Cup Super-4 Schedule) దుబాయ్ వేదికగా ఆదివారం సెప్టెంబర్ 4న తలపడనున్నాయి.
మరో వైపు హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 156 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా దాయాదాల పోరుపై మరింత ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆసియా కప్ లో భాగంగా జరిగిన మరో కీలక మ్యాచ్ లో హాంకాంగ్ పై భారత్ జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇక షెడ్యూల్ పరంగా చూస్తే సూపర్ -4 లో గ్రూప్ – ఎ – నుంచి భారత్ , పాకిస్తాన్(IND vs PAK) జట్లు ఉండగా గ్రూప్ – బి – నుంచి శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ అర్హత
సాధించాయి. వరుస ఓటమి పలకరించడంతో బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఇక షెడ్యూల్ పరంగా చూస్తే శనివారం ఆఫ్గనిస్తాన్ తో శ్రీలంక తలపడనుంది. సెప్టెంబర్ 4న ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. 6న భారత్ తో శ్రీలంక ఆడనుంది.
7న పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. 8న ఆఫ్గనిస్తాన్ తో భారత్ తలపడుతుంది. 9న శ్రీలంక తో పాకిస్తాన్ మ్యాచ్ కొనసాగుతుంది. ఇక సెప్టెర్ 11న ఆసియా కప్ ఫైనల్ జరుగుతుంది.
Also Read : యుఎస్ ఓపెన్ నుంచి సెరీనా నిష్క్రమణ