Asian Champions Trophy : ఆసియా హాకీ చాంపియన్స్ మనదే
4-3 తేడాతో మలేషియాపై విక్టరీ
Asian Champions Trophy : భారత్ వేదికగా జరిగిన ఆసియా కప్ హాకీ చాంపియన్(Asian Champions Trophy) షిప్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. టోర్నీలో హాట్ ఫెవరేట్ గా దిగింది మన టీమ్. అందరి అంచనాలకు తగినట్టుగా రాణించింది. ప్రత్యర్థి జట్లను మట్టి కరిపించింది. ఎక్కడా చాన్స్ ఇవ్వకుండా తనదైన శైలిలో ప్రదర్శన చేసింది. కలిసికట్టుగా రాణించింది. ఇక చెన్నై వేదికగా మలేసియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠను రేపింది. చివరి దాకా ఎవరిని విజయం వరిస్తుందనే దానిపై హాకీ అభిమానులు ఒకింత ఉద్విగ్నతకు లోనయ్యారు.
Asian Champions Trophy to India
మలేషియాను 4-3 తేడాతో అద్భుతమైన గెలుపును స్వంతం చేసుకుంది భారత జట్టు. వరుసగా టీమిండియా నాలుగోసారి ఆసియా కప్ ను కైవసం చేసుకోవడం. ఒక రకంగా ఇది భారతీయ హాకీ చరిత్రలో ఓ రికార్డు అని చెప్పక తప్పదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా ఆటగాళ్లు జుగ్ రాజ్ సింగ్ 9వ నిమిషంలో , కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 45వ నిమిషంలో , గుర్జాంత్ సింగ్ 46వ నిమిషంలో , ఆకాష్ దీప్ సింగ్ 56వ నిమిషంలో చెరో గోల్ సాధించారు. భారత్ కు ఆధిక్యతను తీసుకు వచ్చారు. తొలి సెషన్ లో మలేషియా టాప్ లేపింది. అయితే సెకండాఫ్ లో మనోళ్లు దుమ్ము రేపారు. ప్రత్యర్థి జట్టులో అజారీ, రాజీ రహీం, అమీనుద్దీన్ ఒక్కో గోల్ చేశారు. భారత్ కు బంగారు పతకం దక్కగా మలేషియాకు రజతం దక్కింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, సీఎం ఎంకే స్టాలిన్ బహుమతులు అందజేశారు.
Also Read : TTD Security Comment : భక్తుల భద్రత గాలిలో దీపమేనా
