Asian Cricket Council PCB : పీసీబీ చైర్మన్ పై ఏసీసీ గుస్సా
నజామ్ సేథీ ఆరోపణలు అబద్దం
Asian Cricket Council PCB : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శిగా చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జే షా ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ కూడా. తాజాగా ఆసియా కప్ క్రికెట్ షెడ్యూల్ ను ప్రకటించారు. దీనిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు పాకిస్తాన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజామ్ సేథీ. తమకు తెలియకుండానే తాము నిర్వహించి ఆసియా కప్ ను కూడా మీరే ప్రకటిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీసీ చీఫ్ గా ఉన్న జే షా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తానే సుప్రీం అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. 2023-24 క్యాలెండర్ తయారీని ఎవరిని అడిగి చేశాంటూ ప్రశ్నించారు. కనీసం సభ్య దేశంగా ఉన్న తమకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
ఇదంతా మీ ఇష్టానుసారంగా చేస్తే ఇక తామెందుకు ఆడాలని నిలదీశారు జే షాను సేథీ. దీనిపై శుక్రవారం స్పందించి ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఆయన చేసిన ఆరోపణలు సత్య దూరమని పేర్కొంది ఏసీసీ(Asian Cricket Council). గతంలో పీసీబీ చైర్మన్ గా సేథీ లేరు. ఇప్పటికే అన్ని దేశాలతో చర్చించడం జరిగిందని తెలిపింది ఏసీసీ.
డెవలప్ మెంట్ కమిటీ, మార్కెటింగ్ కమిటీలో గత ఏడాది డిసెంబర్ 13న ఆసియా కప్ క్యాలెండర్ కు అనుమతి తెలిపాయని ఆ విషయం అర్థం చేసుకోకుండా నోరు పారేసుకుంటే ఎలా అని మండి పడింది ఏసీసీ. ఆనాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని పేర్కొంది.
Also Read : శ్రీలంక భళా భారత్ డీలా