Atharva Taide : అథర్వ టైడే రాణించినా తప్పని ఓటమి
15 పరుగుల తేడాతో పంజాబ్ పరాజయం
Atharva Taide : ఓ వైపు భారీ స్కోర్ మరో వైపు వికెట్లు పడుతున్నా ఎక్కడా తలవంచ లేదు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ టీం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 213 పరుగులు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన పంజాబ్ చివరి దాకా పోరాడింది. కానీ విజయం సాధంచలేక పోయింది. 15 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. దీంతో ప్లే ఆఫ్ రేసుకు వెళ్లాలని ఆశించిన ఆ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ నీళ్లు చల్లింది.
ఇక 214 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆశించిన స్థాయిలో రాణించినా చివర్లో బోల్తా పడింది. లియాన్ లివింగ్ స్టోన్ ఉన్నా తన జట్టును గెలిపించ లేక పోయాడు. ఆరంభంలోనే కెప్టెన్ శిఖర్ ధావన్ ను కోల్పోయింది. సున్నాకే వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు ప్రభ్ సిమ్రాన్ సింగ్ , అథర్వ టైడే. ఇద్దరూ కలిసి 2వ వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
సిమ్రాన్ 19 బంతులు ఎదుర్కొని 22 రన్స్ చేశాడు. టైడే 42 బతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 55 రన్స్ చేశాడు.
జితేశ్ శర్మ , షారుఖ్ ఖాన్ నిరాశ పరిచారు. ఇక మైదానంలోకి వచ్చిన లియాన్ లివింగ్ స్టోన్ దంచొ కొట్టాడు. ఒకానొక దశలో ఢిల్లీని కంగారెత్తించాడు. 48 బంతులు ఎదుర్కొన్న స్టోన్ 5 ఫోర్లు 9 సిక్సర్లతో 94 రన్స్ చేశాడు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 రన్స్ చేసింది.
Also Read : Lian Livingstone