IPL Auction : బెంగళూరు వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2022 (IPL Auction )వేలం పాట నిలిచి పోయింది. వేలం పాట నిర్వహిస్తున్న ఐసీసీకి చెందిన ప్రతినిధి హ్యూ ఎడ్మీడ్స్ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడి పోయాడు.
దీంతో ఐపీఎల్ వేలానికి అంతరాయం కలిగింది. ఐపీఎల్ వేలం(IPL Auction )నిర్వాహకుడు హగ్ ఎడ్మీడెస్ కుప్ప కూలడంతో పాల్గొన్న వారంతా విస్తు పోయారు. దీంతో ఐపీఎల్ ఆక్షన్ ను తాత్కాలికంగా నిలిపి వేశారు.
శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ కోసం వేలం పాట నిర్వహిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పాడుతుండగానే హ్యూగ్ ఎడ్మిండెస్ పడి పోయాడు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
డాక్లర్లు అంతా బాగానే ఉందన్నారని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం హ్యూగ్ ఎడ్మిండెస్ స్పృహ లోకి వచ్చాడని, స్థిరంగా ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం భోజన విరామం ఉండడంతో తాత్కాలికంగా ఐపీఎల్ వేలాన్ని నిలిపి వేసినట్లు తెలిపారు.
అయితే ఆయనకు గుండె పోటు వచ్చినట్లుగా భావిస్తున్నారు. అలసట చెందడంతో కొంత ఉద్వేగానికి లోనైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
దీనికి సంబంధించి ఇంకా అప్ డేట్ రావాల్సి ఉంది. ఇప్పటి దాకా ఐపీఎల్ వేలంలో 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. పలువురు ఆటగాళ్లను ఎక్కువ మందిని రాజస్థాన్ రాయల్స్ చేజిక్కించుకుంది.
భారీ ధరకు శ్రేయాస్ అయ్యర్ అమ్ముడు పోయాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చాడు. ఈసారి రైనా, స్మిత్ లకు ఇంకా చాన్స్ రాలేదు. ఆస్పత్రికి తరలింపు చికిత్స కొనసాగుతోంది.
Also Read : పంజాబ్ రబాడా బౌల్ట్ రాజస్థాన్ పరం